తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లిన తర్వాత హిందీ సినీ పరిశ్రమ వైపు ఆసక్తిని చూపించిన తాప్సి అక్కడ మంచి అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ కథానాయకులలో ఒకరుగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఈ బ్యూటీ ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించడానికి ఆసక్తిని చూపిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే చాలా మహిళా ప్రాధాన్యత ఎక్కువ ఉన్న మూవీలలో నటించి మంచి విజయాలను అందుకుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రల్లో నటించిన "ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా" మూవీలోనూ , అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన "ఖేల్ ఖేల్ మే" అనే సినిమాలో కూడా నటించింది.
ఈ రెండు సినిమాలు కూడా కేవలం ఆరు రోజుల వ్యవధిలో ఆగస్టు నెలలో విడుదల కానున్నాయి. ఇలా తాను నటించిన రెండు సినిమాలు విడుదలకు రెడీగా ఉండడంతో ఈ బ్యూటీ వరుసగా ప్రమోషన్లలో పాల్గొంటూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా ఓ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈమె అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఈమెకు విలేకరి నుండి ఎప్పుడైనా అవకాశాలు కోల్పోయారా అనే ప్రశ్న ఎదురయింది. దీనికి తాప్సి సమాధానం ఇస్తూ ... అవును చాలా అవకాశాలు కోల్పోతున్నాను. కానీ వచ్చిన అవకాశాలు , నేను చేసిన పాత్రలు అన్నీ కూడా నాకు ఎంతో సంతోషం ఇస్తున్నాయి.
ఎందుకంటే నేను నాలాగే జీవిస్తూ ఉంటాను , మరొకరిలా జీవించాలని అస్సలు అనుకోను. జీవితం ఇప్పటికే ముగిసిపోలేదు అని నేను అనుకుంటున్నాను. అయినా కూడా అంత దారుణం ఎందుకు జరుగుతుంది. నేను ఎప్పుడూ కూడా నా కెరియర్లో ఎక్కువ పారితోషకం తీసుకొని ఏ సినిమాలో కూడా నటించలేదు. అలా నటించాలి అని కూడా నేను అనుకోవడం లేదు. ఎప్పుడు నా జీవితంలో నెంబర్ గానే ఉండాలనుకుంటున్నాను. దానికోసం పోరాడుతాను. ఇప్పటికి సంపాదించిన దానితో ఎంతో సంతోషంగా జీవించగలను అని తాప్సి సమాధానం ఇచ్చింది.