ఆ హీరోతో తిరిగితే కెరియర్ నాశనం.. సంఘవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్..?

frame ఆ హీరోతో తిరిగితే కెరియర్ నాశనం.. సంఘవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్..?

Pulgam Srinivas
తెలుగు , తమిళ సినీ పరిశ్రమలలో ఎంతోకాలం అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగించిన వారిలో సంఘవి ఒకరు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో విజయాలను అందుకొని ఎంతో కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగింది. ఇకపోతే సంఘవి తెలుగుతో పాటు తమిళ సినీ పరిశ్రమలో కూడా ఎంతో మంది స్టార్ హీరోలు సరసన నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా కాలమే స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం అవకాశాలు చాలా వరకు తగ్గాయి. ప్రస్తుతం ఈమె కొన్ని సినిమాలలో కీలక పాత్రలలో , ముఖ్య పాత్రలలో నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తోంది.

ఇకపోతే ఈమె కెరియర్ అద్భుతమైన స్థాయిలో నడుస్తున్న సమయంలో ఓ హీరోతో తిరగకు అని ఓ దర్శకుడు వార్నింగ్ ఇచ్చాడట. అసలు ఆ హీరో ఎవరు ..? ఎందుకు ఈమెకు వార్నింగ్ ఇచ్చాడు అనే వివరాలను తెలుసుకుందాం. సంఘవి స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలో కోలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి విజయ్ తో అనేక సినిమాలలో నటించింది. వీరి కాంబోలో రూపొందిన చాలా సినిమాలు మంచి విజయాలు అందుకోవడంతో వీరి జంటకు కూడా మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి దక్కాయి.

ఇకపోతే విజయ్ హీరోగా సంఘవి హీరోయిన్గా విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర రావు ఎక్కువ సినిమాలను తీశారు. ఇకపోతే విజయ్ , సంఘవి చాలా సినిమాల్లో కలిసి నటించడంతో వీరి క్లోజ్ నేస్ బాగా పెరిగిందట. దానితో మీరు ప్రేమలో ఉన్నారు అని ఓ వార్త కూడా తమిళ ఇండస్ట్రీలో రావడం మొదలయ్యిందట. దానితో తన కొడుకు పై ఇలాంటి రూమర్స్ వస్తే తన కెరీర్ నాశనం అవుతుంది అనే ఉద్దేశంతో చంద్రశేఖర్ , సంఘవి ఇంటికి వెళ్లి మరి తనతో తన తల్లితో నా కొడుకుతో ఇంకోసారి కలిసి తిరగకూడదు. సినిమాల వరకు ఓకే కానీ ఇద్దరు గురించి వేరేగా మాట్లాడుకుంటున్నారు. అలా జరిగితే నా కొడుకు సినీ కెరియర్ పాడవుతుంది అని వారిద్దరికీ చెప్పి వచ్చాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: