సినిమా ఇండస్ట్రీ లో హిట్ అనేది ఎంత గుర్తింపును తీసుకువస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ దర్శకుడు మ అయిన సూపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటే అతనికి ఆఫర్లు వెల్లువెత్తుతూ ఉంటాయి. ఇకపోతే ఇలాంటి పరిస్థితులనే శ్రీను వైట్ల కూడా ఎదుర్కొన్నట్లు తెలియజేశాడు. తాజాగా శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా తాను దర్శకత్వం వహించిన ఓ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఆ తర్వాత అన్ని ఆఫర్లు వచ్చాయి అనే విషయాలను చెప్పుకొచ్చాడు.
తాజా ఇంటర్వ్యూలో భాగంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ ... నా కెరియర్లో అద్భుతమైన విజయం అందుకున్న సినిమాలలో ఆనందం మూవీ ఒకటి. ఆ మూవీ కంటే ముందు నేను ఒక సినిమా తీసిన ఆ సినిమా విమర్శకులను మెప్పించింది , కానీ కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేదు. ఇక ఆనందం సినిమా అదిరిపోయే రేంజ్ సక్సెస్ అయింది. ఆ మూవీ కి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ లాభాలు కూడా వచ్చాయి. ఉషా కిరణ్ సంస్థ వారు ఆ మూవీ ని రూపొందించారు.
ఆ తర్వాత ఈ సినిమాల్లో లాభాల్లో నడుస్తున్న కూడా ఉష కిరణ్ సంస్థ వారే మరో మూవీ నిర్మించడంతో ఈ సినిమాను కొన్ని థియేటర్ల నుండి తీసివేయాల్సి వచ్చింది. లేకపోయి ఉంటే మరికొన్ని రోజులు కూడా ఆ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడిచేది. ఇక ఆనందం సినిమా అదిరిపోయే రేంజ్ విజయం సాధించిన తర్వాత దాదాపు పది మంది నిర్మాతలు నాకు అడ్వాన్సులు ఇవ్వడానికి నా దగ్గరికి వచ్చారు అని శ్రీను వైట్ల తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో శ్రీను వైట్ల కు వరుస అపజయాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం ఈయన గోపీచంద్ హీరో గా విశ్వం అనే మూవీ ని తెరకెక్కిస్తున్నాడు.