మణిరత్నం.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని సినీ లవర్ ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో. అంతలా ఈ దిగ్గజ దర్శకుడు చలన చిత్రసీమపై తన ముద్రను వేశాడు. విభిన్నమైన సినిమాలకు పెట్టింది పేరు తమిళ దర్శకుడు మణిరత్నం, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.భారతీయ చిత్ర పరిశ్రమలో ఆయనో దిగ్గజ దర్శకుడు. ఎందరికో స్ఫూర్తి, పైగా ఎందరినో ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి. ఆయన సినిమాలు వస్తున్నాయంటే చాలు.. వేయి కళ్లతో ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. అలా అని ఆ లెజెండరీ డైరెక్టర్ తీసేవి మాస్ సినిమాలు కావు. పక్కా క్లాస్ సినిమాలు. ప్రేమ కథలను తెరకెక్కించడంలో ఈ డైరెక్టర్ ది అందెవేసిన చేయి. ఇక ఈయన మూవీస్ లో పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీనే. మరి ఇలాంటి వ్యక్తి డైరెక్టర్ కావడం వాళ్ల నాన్నకు అస్సలు ఇష్టం లేదట. ఈ విషయాన్ని స్వయంగా ఆ దిగ్గజ దర్శకుడే చెప్పాడు.తన సుదీర్ఘ కెరీర్ లో చేసిన సినిమాలు తక్కువే అయినప్పటకీ.. అవి ఇండస్ట్రీ హిట్స్ గా, కల్ట్ క్లాసికల్ మూవీస్ గా నిలిచాయి. మణిరత్నం తెరకెక్కించిన రోజా, దళపతి, గీతాంజలి, బొంబాయి లాంచి చిత్రాలు ఎవర్ గ్రీన్. ప్రేమ కథలను మనసుకు హత్తుకునేలా తీయడంలో ఈ లెజెండరీ డైరెక్టర్ తోపు. కానీ.. మణిరత్నం డైరెక్టర్ కావడం తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదట. ఈ విషయాన్ని మణిరత్నం ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.వీనస్ స్టూడియో రత్నం అయ్యర్ కొడుకుగా వారసత్వంగా మీరు సినీ పరిశ్రమలోకి వచ్చారని చాలా మంది అనుకుంటారు. నాతో అడిగారు కూడా. కానీ నేను దర్శకుడిగా మారింది అలా కాదు. అంతేకాదు మా నాన్న మొదటినుంచి మా కుటుంబాన్ని చిత్ర పరిశ్రమకు దూరంగా వుంచాలని ప్రయత్నించేవాడు. ఆయన ఇష్ట ప్రకారమే నేను ముంబయ్‌లో ఎంబీఎ పూర్తిచేశాను. అయితే ఆ సమయంలోనే ఓ కంపెనీకి డైరెక్టర్‌గా వుండి.. అంత మందితో పనిచేయిస్తూ.. ఆ ఒత్తిడిని తట్టుకోవటం కంటే. నాకు సృజనాత్మకమైన దర్శకుడిగా వుండటం బెటర్ అనిపించింది. అందుకే సినిమాల వైపు వచ్చేశాను. అయితే అందరూ నేనేదో విదేశాలకు వెళ్లి ఫిలిం కోర్సు చేశానని అనుకుంటారు. కానీ నేను ఎలాంటి కోర్సు పూర్తిచేయలేదు. నిజం చెప్పాలంటే సినీ పరిశ్రమకు వచ్చే నాటికి నాకు దర్శకత్వం అంటే ఏమో కూడా తెలియదు. పట్టుదలతో ఏదైనా నేర్చుకుంటే వస్తుందనే నమ్మకంతోనే ఒక సినిమాకు దర్శకత్వం వహించాను. అలా ఆ రోజు ధైర్యం చేశాను. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే దర్శకత్వం చేస్తున్నా.. ప్రతి సినిమా మొదటి సినిమాలాగా కష్టపడాల్సిందే అని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం మణిరత్నం-కమల్ హాసన్ కాంబినేషన్ లో ‘థగ్ లైఫ్’ అనే ప్రతిష్టాత్మకమైన సినిమా తెరకెక్కుతోంది.