బ్రహ్మానందానికి గురువు చెప్పిన మాట.. ఇప్పటికీ స్ట్రిక్ట్‌గా పాటిస్తారు..?
సినిమా రంగంలో కట్టుబాట్లకు కట్టుబడి ఉండడం.. నిబద్ధతగా ఉండడం చాలా చాలా కష్టం. ఎందుకంటే.. నిత్యం ఎంతో మంది భిన్నమైన వ్యక్తులను కలుస్తుంటారు. పరభాషా నటులతోనూ కలిసి నటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారితో ఏర్పడే స్నేహాలు.. కట్టుబాట్లను తుంచేలా ప్రమాద కర పరిస్థితికి చేర్చుతా యి. ఇలాంటి సమయంలో మనసును కట్టడి చేసుకుని ముందుకు సాగడం అనేది ఎంత పెద్ద నటులకైనా కష్టమే. సినీ రంగం అనేది గ్లామర్ ఫీల్డ్ ఇక్కడ కట్టు బాట్లు .. సంప్రదాయాలు పాటించడం అంటే అది కత్తి మీద సాము లాంటిదే.. !
ఎస్వీ రంగారావు వంటి ధీశాలికి కూడా.. ఒకానొక సందర్భంలో మందు తాగక తప్పలేదు. తర్వాత.. పరిస్థితు లకు ఆయన అలవాటు పడలేక.. మద్యం బాట పట్టారని అంటారు. ఇక, రేలంగి వెంకట్రామయ్య మహా హాస్య నటుడు. ఆయన కదిలితే నవ్వు.. మాట్లాడితే కితకితలు వస్తాయి. అయితే.. ఈయన కూడా అప్పుడ ప్పుడూ.. మద్యం సేవించేవారని సినీమా రంగంలో టాక్. ఇదిలావుంటే.. ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మందితో తెరను పంచుకున్నా.. బ్రహ్మానందానికి మద్యం అలవాటు కాకపోవడం గమనార్హం.
అంతేకాదు.. ఆయన చుక్క మద్యం వాసన కూడా ఎరుగరని తానే స్వయంగా చెప్పడం మరింత విశేషం. `మద్యం అలవాటు కాలేదు. ఇది మా గురువుగారు జంధ్యాల నేర్పిన మాట` అని సవినయంగా చెప్పుకొన్నారు బ్రహ్మీ. `బ్రహ్మానందం.. నువ్వు ఎన్ని వేషాలైనా వెయ్యి. కానీ, మూడు `మ`ల జోలికి మాత్రం పోవద్దు. ఇలా వెళ్లి అనేక మంది కెరీర్‌ను పాడు చేసుకున్నారు` అని బ్రహ్మానందం చెప్పుకొన్నారు. ఈ మూడు `మ`లు.. 1) మగువ 2) మద్యం 3) మనీ. ఈ మూడిటి విషయంలో జాగ్రత్తగా లేకపోతే.. కెరీర్ పాడవుతుందన్న జంధ్యాల మాటను తూచ తప్పకుండా బ్రహ్మానందం ఇప్పటికీ పాటిస్తున్నారు.