టాలెంటెడ్ నటుడు అడివి శేష్ డిఫెరెంట్ కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. ప్రస్తుతం డెకాయిట్ మరియు గూఢచారి 2 (G2) చిత్రాలు చేస్తున్నాడు. తాజాగా అడివి శేష్ గూఢచారి 2 కి సంబందించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను షేర్ చేశాడు. గూఢచారి చిత్రం ఆరేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ చిత్రం సీక్వెల్ అయిన గూఢచారి 2 నుండి 6 మూమెంట్స్ ను విడుదల చేశారు. దర్శకుడు వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, AK ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ మరొక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సందర్భంగా శేష్ మాట్లాడుతూ.. "గూఢచారి సినిమా చాలా ప్రత్యేకమైనది. గత 6 సంవత్సరాలుగా ఈ సినిమా గురించి ప్రశంసలు వింటూనే వున్నాను. G2 బిగ్గర్ అండ్ ఇంటర్ నేషనల్ స్కేల్ లో వుంటుంది. గూఢచారి అభిమానులందరికీ G2 ఒక మ్యాసీవ్ విజువల్ ట్రీట్ అవుతుంది' అన్నారు.
దర్శకుడు సిరిగినీడి మాట్లాడుతూ, "ప్రస్తుతం 40% షూటింగ్ పూర్తి చేశాం. సినిమా అద్భుతమైన క్యాలిటీతో వస్తోంది. సినిమా రూపుదిద్దుకుంటున తీరుపై చాలా నమ్మకంగా, ఉత్సాహంగా వున్నాం. విజువల్ వండర్ క్రియేట్ చేయడంపై దృష్టి పెట్టాం. థ్రిల్లింగ్ సెట్ పీస్ లు, డైనమిక్ యాక్షన్ సీక్వెన్స్ లు ఇలా ప్రతి ఎలిమెంట్ ప్రేక్షకులను గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తోంది. యాక్షన్ డ్రామా జానర్‌లోని అభిమానులందరికీ ఈ చిత్రం గొప్ప అనుభూతిని ఇస్తుంది' అన్నారు... ఇకపోతే 2025 సెకండ్ హాఫ్ లో గ్రాండ్‌గా విడుదల కానున్న G2 అన్ని ప్రధాన భారతీయ భాషల్లో అవైలబుల్ గా ఉంటుంది. ఇది వైడ్ రేంజ్ లో ప్రేక్షకులకు రీచ్ అవుతోంది.. !!