కన్నడ స్టార్ హీరో యశ్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాను అంత త్వరగా ఎవరు మర్చిపోలేరు. అప్పట్లో ఈ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విడుదల అయిన మొదటి రోజు నుండి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది. అయితే కేజీఎఫ్ వచ్చిన తర్వాత కేజిఎఫ్ 2 భారీ అంచనాల నడుమ విడుదలై ఇది కూడా వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ను అందుకుంది. అయితే ఈ రెండు సినిమాల్లో కూడా యష్ హీరోగా నటించాడు ప్రశాంత్ దర్శకత్వంలోనే వచ్చింది.
ఇక అప్పట్లో కేజిఎఫ్ సీక్వెల్ గా వచ్చిన కేజిఎఫ్ 2 సినిమా భారత దేశంలోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టిన మొదటి సినిమాగా సరికొత రికార్డు కూడా సృష్టించింది. అయితే ఈ సినిమా చివరిలో పార్ట్ 2 కి కూడా సీక్వెల్ ఉండబోతోంది అన్న హింట్ ఇచ్చాడు దర్శకుడు. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కేజీఎఫ్ 2 సినిమాకి సీక్వల్ గా కేజిఎఫ్ త్రీ కూడా కచ్చితంగా ఉంటుంది అన్న సమాచారం వినబడుతుంది. తెలుస్తోంది.తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ ఈ సీరిస్ లో నటించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా గత శనివారం జరిగిందని,
అజిత్ కుమార్ కెరీర్ లో 64 వ సినిమాగా KGF-3 ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ అజిత్ తో రెండు సినిమాలు తెరకెక్కించనున్నాడు ప్రశాంత్ నీల్. అజిత్ తో నిర్మించే ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనుంది హోంబాలే ఫిల్మ్స్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. అటు రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ -2కూడా ఉంది. ఈ రెండు చిత్రాలు పూర్తి చేసిన తర్వాత అజిత్ చిత్రం స్టార్ట్ చేస్తాడా, ఎప్పుడన్నది క్లారిటీ రావాలి. ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనుండడంతో అజిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.