కల్కి 2898AD: ఫ్యాన్ మేడ్ సాంగ్ కి.. ప్రేక్షకులు ఫిదా..హైలెట్ అవుతున్న వీడియో..!

frame కల్కి 2898AD: ఫ్యాన్ మేడ్ సాంగ్ కి.. ప్రేక్షకులు ఫిదా..హైలెట్ అవుతున్న వీడియో..!

Divya
టాలీవుడ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు.. డైరెక్టర్  నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం కల్కి 2898 AD. ఇందులో బాలీవుడ్ స్టార్స్ సైతం నటించారు. ముఖ్యంగా అమితాబచ్చ, కమలహాసన్, దీపికా పదుకొనే, దిశాపటాని వంటి వారు అద్భుతంగా నటించారు. విలన్ గా కమలహాసన్ నెక్స్ట్ లెవెల్ లో ఈ సినిమాని ముందుకు తీసుకువెళ్లడం జరిగింది. సైన్స్ ఫిక్షన్ తో పురాణాలకు సైతం ముడి పెడుతూ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది సుమారుగా 600 కోట్ల రూపాయల బడ్జెట్లో తెరకెక్కించిన ఈచిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కేవలం విడుదలైన నాలుగు రోజులలోనే 555కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో సరికొత్త రికార్డును సృష్టించింది కల్కి చిత్రం. ఇప్పటికే 1250 కోట్లకు పైగా కలెక్షన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే సినిమా టికెట్లు కూడా కేవలం 100 రూపాయలకు తగ్గించడం జరిగింది. ఇలా ఎన్నో రికార్డులను సైతం సృష్టించిన కల్కి చిత్రం ఇప్పుడు మరొక రికార్డులు సైతం సృష్టించినట్లుగా తెలుస్తోంది. అది కూడా అభిమానులు చేసిన ఒక ఫ్యాన్ మేడ్ సాంగ్ హైలెట్గా నిలుస్తోంది.
ఒరిజినల్ సాంగు కంటే ఈ వీడియోని అభిమానులు ఎక్కువగా ఆదరిస్తున్నట్లు తెలుస్తోంది.. కేవలం కొంతమంది యూట్యూబర్స్ వాళ్ల టాలెంట్ తో ఈ సాంగ్ ని ఒక మేకింగ్ వీడియోల కంపోజ్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని పోస్టర్లతో లిరిక్స్ సాంగులతో కూడా ఒక వీడియో సాంగ్ ని కంపోజ్ చేసి మరి విడుదల చేశారు. ముఖ్యంగా ఈ సాంగ్ కూడా బాగా రావడంతో యూట్యూబ్లో విడుదల చేశారు. అలా అప్లోడ్ చేసిన కేవలం 24 గంటలలోనే లక్ష్య వ్యూస్ తో ఒక సరి కొత్త రికార్డును సృష్టించింది ఈ వీడియో. మరి రాబోయే రోజుల్లో కచ్చితంగా ఈ వీడియో మరి సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని అభిమానులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: