పూరీ పనైపోలేదు..అదే జోరు.. గూస్ బంప్స్ తెప్పించిన రామ్ స్పీచ్..!!

murali krishna
ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంపై హైప్ బాగానే ఉంది. ఈ ఊర మాస్ యాక్షన్ మూవీకి స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. సూపర్ హిట్ ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‍గా ఈ సినిమా వస్తోంది. డబుల్ ఇస్మార్ట్ చిత్రం ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈ సినిమా ట్రైలర్‌ను మూవీ టీమ్ నేడు (ఆగస్టు 4) రిలీజ్ చేసింది.హీరో రామ్ డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. రామ్, పూరి జగన్నాథ్ అభిమానుల్ని ఆకట్టుకునేలా ఆ ట్రైలర్ ఉంది. ట్రైలర్ చూస్తుంటే ఇస్మార్ట్ శంకర్ మాదిరిగానే కనిపిస్తోంది. ఈ సారి సంజయ్ దత్‌ను పెట్టి పూరి ఏదో కొత్తగా ట్రై చేసినట్టు అనిపిస్తుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఆదివారం నాడు వైజాగ్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మీ ఇద్దరూ డుమ్మా కొట్టేశారు.ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రామ్ మాట్లాడుతూ.. ఇస్మార్ట్ శంకర్ రోజుల్లోకి వెళ్లాడు. గోవాలో స్క్రిప్ట్ రాస్తున్న టైంలో తనను అక్కడికే రమ్మన్నాడట పూరి జగన్నాథ్. ఎలాంటి సినిమా చేద్దామని చర్చించుకుంటున్న టైంలో.. ఓ పదేళ్ల పాటు గుర్తుండిపోయే పాత్రని ఇవ్వండని అడిగాడట రామ్. అప్పుడే ఇస్మార్ట్ శంకర్ కారెక్టర్‌ను డిజైన్ చేశాడట. ఇదొక మెంటల్ మాస్ కారెక్టర్ అని అన్నాడు రామ్.‘ఆ కారెక్టర్ గురించి రాస్తున్నప్పుడు.. ఆయన చెబుతున్నప్పుడే.. ఫుల్ ఎగ్జైట్ అయ్యాను.. నేను ఎగ్జైట్ అయిన దాంట్లో ఆడియెన్స్ పది శాతం ఎగ్జైట్ అయినా చాలు హిట్ అవుతుందని అనుకున్నా.. అలానే ఇస్మార్ట్ శంకర్ అయింది.. ఈ సారి అలాంటి కారెక్టర్‌కు మంచి స్క్రిప్ట్ ఉంటే బాగుంటుందని పూరి గారితో అన్నాను.. ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు.. ఆయన కెరీర్‌లో ఇంత ఆలస్యంగా తీసిన సినిమా ఇదే..పూరితో పని చేసేటప్పుడు కాకుండా అతని స్క్రిప్ట్ వింటుంటే కిక్ వస్తుంది అని రామ్ అన్నారు.ఆయన కమర్షియల్ చిత్రాలకు పెట్టింది పేరు..కమర్షియల్ చిత్రాలు తీయడం అంత ఈజీ కాదు.. కమర్షియల్ చిత్రాలతో హిట్ కొడితే వచ్చే కిక్కు.. వేరే చిత్రాలతో హిట్ కొట్టినా రాదు.. అని ఈ సందర్భంగా రామ్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: