మురారితో విజయ్ కి మహేష్ చెక్ పెట్టనున్నాడా..?

frame మురారితో విజయ్ కి మహేష్ చెక్ పెట్టనున్నాడా..?

MADDIBOINA AJAY KUMAR
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ అయినటువంటి మురారి సినిమాను రీ రిలీస్ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. మహేష్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9 వ తేదీన కావడంతో అదే తేదీన మురారి సినిమాను భారీ ఎత్తున రు రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం ప్రకటించింది. ఈ మూవీ కి సంబంధించిన టికెట్లను ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఆన్లైన్ లో కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ యొక్క టికెట్ బుకింగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ మూవీ యొక్క మొదటి రోజు టికెట్ లకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్లతోనే ఒక కోటి రూపాయల వరకు కలెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఆగస్టు 9 వ తేదీకి చాలా రోజులు ఉంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలియడంతో మరికొన్ని రోజుల్లో ఇంకా మెరుగ్గా ఈ మూవీ కలెక్షన్లు ఉండే అవకాశం ఉంది. దానితో మురారి సినిమా రీ రిలీజ్ తో మహేష్ సరికొత్త రికార్డులను సృష్టించబోతున్నట్లు క్లియర్ గా అర్థం అవుతుంది.

కొంత కాలం క్రితం తమిళ నటుడు విజయ్ హీరో గా రూపొందిన గిల్లి మూవీ ని రీ రిలీస్ చేయగా ఆ సినిమాకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ప్రస్తుతం మురారి మూవీ టికెట్ బుకింగ్స్ కి ప్రేక్షకుల నుండి దక్కుతున్న రెస్పాన్స్ ను చూస్తూ ఉంటే గిల్లి మూవీ రికార్డులను మహేష్ హీరోగా రూపొందిన మురారి చాలా ఈజీగా దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మహేష్ హీరోగా రూపొందిన మురారి సినిమా రీ రిలీస్ లో భాగంగా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: