టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మల్లాడి వశిష్ట ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను యూ వి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తూ ఉండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా విడుదల తేదీ ఇప్పటికే లాక్ అయ్యి ఉండడంతో ఆ తేదీన కచ్చితంగా ఈ సినిమాను విడుదల చేయాలి అనే ఉద్దేశంతో పక్కా ప్లానింగ్ తో ఈ మూవీ యొక్క షూటింగ్ ను మేకర్స్ పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఒక అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆ ఐటమ్ సాంగ్ కోసం మూవీ యూనిట్ ఇద్దరు హీరోయిన్లు అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వారెవరో కాదు శృతి హాసన్ , తమన్నా వీరిద్దరిలో ఒకరితో ఐటెం సాంగ్ చేయించాలి అని మూవీ యూనిట్ అనుకుంటున్నట్లు అందులో భాగంగా మరికొన్ని రోజుల్లో వీరితో సంప్రదింపులు జరపాలి అనే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే మిల్కీ బ్యూటీ తమన్నా , చిరంజీవి హీరో గా రూపొందిన సైరా నరసింహా రెడ్డి , భోళా శంకర్ రెండు సినిమాల లోను హీరోయిన్ గా నటించింది. శృతి హాసన్ చిరు హీరోగా వాల్టేరు వీరయ్య సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న విశ్వంభర మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి. ఈ సినిమాతో చిరు ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.