పుష్ప 2 నుంచి స్టన్నింగ్ అప్డేట్.. ఖుషిలో ఫ్యాన్స్..!!

frame పుష్ప 2 నుంచి స్టన్నింగ్ అప్డేట్.. ఖుషిలో ఫ్యాన్స్..!!

murali krishna
ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప-2’. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. పుష్ప సినిమాకి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక ఈ మూవీ డిసెంబ‌ర్ 6న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా.. తాజాగా చిత్ర బృందం ఓ అప్‌డేట్‌ను అభిమానుల‌తో పంచుకుంది.అయితే ఈ చిత్రానికి సంబంధించిన విడుదలైన ప్రతి ప్రమోషన్‌ కంటెంట్‌ అందరిలోనూ అంచనాలు పెంచేస్తున్నాయి. ర‌ష్మిక మంధాన హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. అన‌సూయ‌, సునీల్ లు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌లైన టీజర్‌, రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది.అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్‌ ఇండియా చిత్రంగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.ఇన్ని రోజులుగా పుష్ప 2 షూటింగ్ ఆగిపోయిందంటూ వ‌స్తున్న వార్త‌ల‌కు చెక్ పెట్టింది చిత్రయూనిట్. ప్ర‌స్తుతం క్లైమాక్స్ షూటింగ్ శ‌రవేగంగా జ‌రుపుకుంటున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది.అయితే ఈ సినిమాకు సంబంధించి గ‌త కొన్ని రోజులుగా అల్లు అర్జున్‌కు, ద‌ర్శ‌కుడు సుకుమార్‌కి మ‌ధ్య గొడ‌వ‌లు అయిన‌ట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పుష్ప 2 షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న క్ర‌మంలో వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగిన‌ట్లు.. దీంతో అల్లు అర్జున్ సుకుమార్ మీద ఉన్న కోపంతో త‌న గ‌డ్డం తీసేసి ట్రిప్‌కు చెక్కేసార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. అయితే ఈ వార్త‌లు ఫేక్ అని చిత్రబృందం త‌ర్వాత క్లారిటీ ఇచ్చింది.ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది. భారీ వ్య‌యంతో నిర్మించిన ఓ సెట్‌లో ప‌తాక స‌న్నివేశాల‌కు సంబంధించిన షూటింగ్ జ‌రుగుతున్న‌ట్లు తెలిపింది. హీరో బ‌న్నీతో పాటు కీల‌క న‌టులు అంతా ఇందులో పాల్గొంటున్నారు.క్లైమాక్స్ స‌న్నివేశాలు అద్భుతంగా వ‌స్తున్నాయ‌ని, థియేట‌ర్ల‌లో వీటిని చూస్తే అభిమానుల‌కు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయ‌ని చెబుతోంది. ఈ విష‌యం తెలుసుకున్న అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: