"మాస్" మూవీ విలను గుర్తున్నాడా..ఎలా మారిపోయాడో చూడండి?

frame "మాస్" మూవీ విలను గుర్తున్నాడా..ఎలా మారిపోయాడో చూడండి?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అమ్మాయిల కలల రాకుమారుడుగా.....తన నటనతో మన్మధుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. నాగార్జున నటనకి ఎంతోమంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. నాగార్జున సినిమా వచ్చిందంటే చాలు ఎగబడి చూస్తారు.

ఇక నాగార్జున సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వస్తే చాలు అని ప్రతి ఒక్క హీరోయిన్ అనుకుంటుంది. నాగార్జున నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో మాస్ సినిమా ఒకటి. ఈ సినిమా 2004లో రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాని రాఘవ లారెన్స్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో జ్యోతిక, చార్మి నాగార్జున సరసన హీరోయిన్లుగా నటించారు. మా సినిమాలో రఘువరన్ మెయిన్ విలన్ పాత్ర పోషించారు. ఇందులో శేషు పేరు బాగా వినిపిస్తోంది. ఈ పాత్రను పోషించింది ఢిల్లీకి చెందిన రాహుల్ దేవ్. ఈ సినిమాలో అతను జ్యోతికకు అన్నయ్య పాత్ర పోషించాడు.
విశాఖపట్నంలో శేషు పాత్ర సినిమాకు పెద్ద అస్సెట్. ఈ సినిమాలో రఘువరన్ మెయిన్ విలన్ అయినప్పటికీ స్క్రీన్ స్పేస్ అంతా రాహుల్ కే దక్కింది. ఆ సినిమా అనంతరం రాహుల్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతంగా సినిమా ఆఫర్లు వచ్చాయి. నాగార్జున నటించిన ఆకాశవీధిలో అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రాహూల్ దేవ్. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన కౌబాయ్, టక్కరి దొంగలో నటించాడు. 

అంతేకాకుండా సీతయ్య, సింహాద్రి, నరసింహుడు, ఆంధ్రావాలా, అల్లరి పిడుగు, అతడు, అస్త్రం, జై చిరంజీవ, చిన్నోడు, పౌర్ణమి, ఒక్కడున్నాడు, తులసి, లవ్లీ, మున్నా, నాయక్, షాడో, బాయ్, లౌక్యం, ఎవడు, ఒక్క అమ్మాయి తప్ప, ఇంటలిజెంట్ వంటి ఇంకా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించాడు రాహుల్ దేవ్. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటించాడు. అయితే 2018 తర్వాత రాహుల్ పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: