పవన్ నియోజకవర్గంలో.. తారక్ బావమరిది మూవీ ఈవెంట్..!
మొన్నిమధ్యన నటుడు శర్వానంద్ మూవీ ఈవెంట్ ను ఇక్కడే నిర్వహించాలనుకున్నా కొన్ని కారణాలతో అనుమతులు రాక వారి ఆలోచనను విరమించుకున్నారు. అయితే ఇక్కడ ఏ సినిమా ఈవెంట్లు జరిగనప్పటికి..ఇతర సినిమా ప్రముఖులు వెళ్ళి అక్కడ సందడి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఒక సినిమా ఈవెంట్ కు మాత్రం ముహూర్తం ఖరారైంది. టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది ' నార్నె నితిన్' కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ఆయ్' ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇక ఆయ్ సేమ ప్రమోషన్స్ లో భాగంగా..ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నో పిఠాపురంలో నిర్వహించనున్నారు. సోమవారం నాడు (ఆగస్టు 05) పిఠాపురంలోని సత్య కృష్ణ కన్వెన్షన్ లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ లాంచ్ ను ఉదయం 11 గంట్లకు నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి నార్నె నితిన్ తో పాటు హీరోయిన్, మూవీ టీమ్ అంతా హాజరవు బోతున్నారు. అలాగే పిఠాపురంలో మొదటిసారి అధికారిక సినిమా ఈవెంట్ నిర్వహించడంతో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు.. స్థానికులు భారీగా తరలి రావచ్చనే సమాచారం.