పాపం: ఈ రెండు చిత్రాలకు అదే సమస్య.. మార్చుకోలేరా..?
అయితే స్టార్ హీరోలు చిత్రాలకు నైజాంలో సింగిల్ స్క్రీన్ లతో ఎలాంటి ఇబ్బంది లేదు.. కానీ రెండు మూడు థియేటర్లు ఉంటే చాలు చెరోకటి లభిస్తూ ఉంటుంది. కానీ మల్టీప్లెక్స్ లోనే చాలా సమస్య ఏర్పడుతుందట. అన్ని చిత్రాలకు స్క్రీన్లు అడ్జస్ట్ చేయడం చాలా కష్టము. హిందీ సినిమాలకు కూడా ఐమాక్స్ పివిఆర్ లో కచ్చితంగా రెండు షోలు వేయాల్సిందే. అలా ఖచ్చితంగా హిందీ సినిమాలకే ఐదు ఆరు షోలు వెళ్లిపోతాయి. మిగిలిన షోలు కేవలం నాలుగింటిలో తెలుగు సినిమాలనే వేసుకోవాల్సి ఉంటుంది.
ఇక సినిమా విడుదలైన తర్వాత ఏ సినిమాకి ఎక్కువగా టాక్ బాగుంటుందో ఆ సినిమాకి స్క్రీన్లు వెళ్ళిపోతాయి. ఇదంతా బాగానే ఉన్న ఇక్కడే ఒక సమస్య ఉన్నదట. ధమాకా సినిమా మంచి బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో నైజాంలో 13 కోట్ల పైగా సాధించింది. అయితే ఈ సినిమాకి ఆపోజిట్ గా పెద్దగా ఏ సినిమాలు కూడా లేవు.. కానీ ఇప్పుడు సోలోగా ఏ సినిమా విడుదల కాలేదు. పైగా రెండు వారాలలో నాని నటించిన సరిపోద శనివారం సినిమా కూడా విడుదల కాబోతోంది... డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా నైజం ఏరియాలో 15 కోట్ల వరకు సంపాదించేలా కనిపిస్తోంది. ఒకవేళ ఈ రెండు చిత్రాలకు పోటీ లేకుండా విడివిడిగా వచ్చి ఉంటే మల్టీప్లెక్స్ స్క్రీన్లు కూడా ఎక్కువగా దొరికేది. వీటివల్లే ఓపెనింగ్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉండదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి డైరెక్టర్లు సినిమాని ఎవరైనా పోస్ట్ ఫోన్ చేసుకుంటారేమో చూడాలి.