హాట్ టాపిక్ కాబోతున్న బాలకృష్ణ ఈవెంట్ !

frame హాట్ టాపిక్ కాబోతున్న బాలకృష్ణ ఈవెంట్ !

Seetha Sailaja
నందమూరి తారకరామారావు నట వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తన నటజీవితం 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా భాగ్యనగరంలో ఘనమైన సత్కార సభను సెప్టెంబర్ 1న ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కు అనేకమంది రాజకీయ రంగ ప్రముఖులు సినీప్రముఖులు హాజర్ కాబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల తో పాటు అనేకమంది మంత్రులను ఈసభకు ఆహ్వానిస్తారని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సభకు పవన్ కళ్యాణ్ ను కూడ మరొక అతిధిగా పిలుస్తారని అంటున్నారు. అనేకమంది సినీ ప్రముఖులు పాల్గొనబోతున్న ఈసమావేశానికి జూనియర్ ఎన్టీఆర్ ను అతిధిగా ఆహ్వానిస్తారా లేదా అన్నవిషయమై అనేక ఊహాగానాలు వస్తున్నాయి.

బాలకృష్ణ కుటుంబ సభ్యులు అందరు కూడ పాల్గొనే ఈ ఈవెంట్ లో జూనియర్ రాక పై అనేక గాసిప్పులు ఇప్పటి నుండే హడావిడి చేస్తున్నాయి. జూనియర్ తో పాటు ఈ ఈవెంట్ కు చిరంజీవి నాగార్జున మోహన్ బాబులతో పాటు టాప్ యంగ్ హీరోలు అల్లు అర్జున్ రామ్ చరణ్ ప్రభాస్ మహేష్ లు కూడ ఈ ఈవెంట్ కు వస్తారా రారా అన్న విషయమై ఇప్పటి నుండే ఆశక్తికర చర్చలు మొదలయ్యాయి.

ప్రస్తుతం బాలకృష్ణ కెరియర్ టాప్ గేర్ లో కొనసాగుతోంది. వరసపెట్టి వచ్చిన సినిమాలు ఒప్పుకోకుండా కథల ఎంపిక విషయంలో బాలకృష్ణ చాల ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. దీనికితోడు రాజకీయంగా కూడ బాలయ్య చాల యాక్టివ్ గా ఉంటున్న పరిస్థితులలో ఈ ఈవెంట్ అత్యంత ఘనంగా జరగడమే కాకుండా మీడియా వర్గాలకు హాట్ టాపిక్ గా మారనున్నది. ఎంతోమంది ప్రముఖులు ఈ ఈవెంట్ కు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కు అతిధిగా వచ్చినప్పుడు మాత్రమే నందమూరి అభిమానులు జోష్ లో ఉంటారు అన్నది వాస్తవం. దీనితో జూనియర్ రాక పై అన్ని వర్గాలలోను ఆశక్తి బాగా నెలకొని ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: