పాయల్ : నా పై వచ్చిన ఆ క్రేజీ రూమర్ నిజమైతే బాగుండనిపించింది..!!

frame పాయల్ : నా పై వచ్చిన ఆ క్రేజీ రూమర్ నిజమైతే బాగుండనిపించింది..!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఓవైపు అభిమానులు తమ ఫేవరేట్ స్టార్ పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. డార్లింగ్ మాత్రం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ప్రస్తుతం డార్లింగ్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రాలు కావడం విశేషం. అయితే బాహుబలి సినిమా టైమ్ నుంచి డార్లింగ్ పెళ్లి కబురు కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అప్పట్లో ఇదే విషయంపై ప్రభాస్ ను అడగ్గా.. బాహుబలి తర్వాత అన్నారు. కానీ ఈ మూవీ విడుదలైన సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ డార్లింగ్ మాత్రం తన పెళ్లి గురించి నోరువిప్పడం లేదు.ఇది ఇలా ఉంటే ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార పాయల్ రాజ్‌పుత్. తొలిసినిమాలోనే తనదైన నటన, అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ చిన్నది.నెగిటివ్ రోల్‌లో నటించి తన నట విశ్వరూపాన్ని చూపించింది. ఇక ఆపై వరుసగా బడా అవకాశాలు దక్కించుకున్న పాయల్ ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే తనకు తొలి హిట్‌ను ఇచ్చిన అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం మూవీతో మరోసారి బ్లాక్ బ్లస్టర్‌ను సొంతం చేసుకుంది.ఇక ప్రభాస్‌తో పాయల్‌ పెళ్లైందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ రూమర్‌పై తాజాగా పాయల్‌ పాప స్పందించారు. ప్రభాస్‌తో పెళ్లైందంటూ వచ్చిన వార్త నిజమైతే బాగుండు అని సరదాగా అన్నారు.
తాజాగా హైదరాబాద్‌లో ఫిలింఫేర్‌ అవార్డ్స్ సౌత్ 2024 వేడుకలు జరగగా.. అవార్డుల ప్రదానోత్సవంలో పాయల్‌ రాజ్‌పుత్‌ సందడి చేశారు.ఇక కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ తన గ్లామర్ ఫొటోలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టే ఈ చిన్నది తాజాగా ఫిలిం ఫేర్ అవార్డుల వేడుకల్లో పాల్గొంది. ఈ వేడుకలో పాల్గొన్న పాయల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇప్పటి వరకు మీ గురించి వచ్చిన ఫన్నీ రూమర్ ఏంటి.? అని ప్రశ్నకు బదులిస్తూ.. ప్రభాస్‌తో నా పెళ్లి అయ్యిందటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. వాటిని చూసి బాగా నవ్వుకున్నాని, అది నిజమైతే బాగుండని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది పాయల్‌.ఇక తన జీవితాన్ని వేరే నటి లేదా నటుడి లైఫ్‌తో ఎక్స్‌ఛేంజ్ చేసుకోవాలనుకుంటే ఎవరిని ఎంచుకుంటారన్నన అడగ్గా.. తనకు అలాంటి ఉద్దేశం ఏదీ లేదని. ప్రస్తుతం తాను ఎంతో సంతోషంగా ఉన్నాని చెప్పుకొచ్చింది. చుట్టూ ఉన్నవారిని ప్రేమిస్తున్నానని, వాళ్లంతా తనపై చూపించే ప్రేమాభిమానాల వల్ల జీవితం మరింత అందంగా మారిందని చెప్పుకొచ్చింది.ఇది ఇలా ఉంటే గతంలో కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టిని ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని వార్తలు వినిపించాయి. కానీ అవేవీ వాస్తవాలు కాదని తేలింది. అయితే రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్‌ తో ప్రభాస్ లవ్‌లో ఉన్నారంటూ కూడా టాక్ వినిపించింది. ఇక మొత్తానికి ప్రభాస్ పెళ్లి ఎవరితో అనేది ఇప్పట్లో తీరని సస్పెన్స్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: