అయ్యో: కూలిపోయిన సినిమా చెట్టు.. ఈ చెట్టు హిస్టరీ తెలిస్తే షాకే..!
కొన్ని వందల సినిమా షూటింగులు ఈ చెట్టు కింద ఎక్కువగా జరిగాయి. ఈ చెట్టు ఎక్కడో కాదు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో కుమార దేవం లో ఉన్నటువంటి చెట్టే.. నిన్నటి రోజున ఈ చెట్టు కూలిపోయినట్లుగా తెలుస్తోంది.. 1975 లో విడుదలైన పాడిపంటలు సినిమా నుంచి రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా వరకు ఈ సినిమా చరిత్ర ఉన్నది. అలనాటి డైరెక్టర్లలో జంధ్యాల, కె.విశ్వనాథ్, వంశి తదితర డైరెక్టర్లకు ఈ చెట్టు మంచి ఫేవరెట్ స్పాట్ ఆట.
చాలా మంది ఈ సినిమా షూటింగ్ సమయాలలో ఆ చెట్టు కింద భోజనం చేసేవారు. ఈ సినిమా చెట్టు దగ్గర సుమారుగా 300 సినిమా షూటింగ్ లు జరగడం గమనార్హం. కుమారదేవం గ్రామానికి సైతం మంచి పేరు రావడానికి ముఖ్య కారణం ఈ సినిమా చెట్టే.. ఈ చెట్టు తమ ఊరికి చాలా పేరు తెచ్చిందని అక్కడ ప్రజలు తెలియజేశారు. కానీ ఆ చెట్టు ఇప్పుడు కూలిపోవడం చాలా బాధ కలిగిస్తుంది అంటూ అక్కడి గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని చాలా మంది సెలబ్రిటీలు కూడా తమ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.