బాలయ్య కోసం తమన్ మాస్ సాంగ్.. అందులో స్పెషల్ అదే..?

frame బాలయ్య కోసం తమన్ మాస్ సాంగ్.. అందులో స్పెషల్ అదే..?

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా భగవంత్ కేసరి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , బాలకృష్ణ సరసన హీరోయిన్గా నటించగా , అనిల్ రావిపూడి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. శ్రీ లీల ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ , బాబీ దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన చాలా బాగా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిన ఈ మూవీ యొక్క టైటిల్ ని గాని , ఈ సినిమా విడుదల తేదీని కానీ మేకర్స్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇకపోతే బాలకృష్ణ , తమన్ కాంబో అంటే ఆ ఆల్బమ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి అనే విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే NBK 109 ఆల్బమ్ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో ఒక అదిరిపోయే మా సాంగ్ ఉండబోతున్నట్లు ఇప్పటికే తమన్ దానికి ట్యూన్ ఇచ్చినట్లు ఆ ట్యూన్ అదిరిపోయే రేంజ్ లో ఉన్నట్లు ఇక ట్యూన్ అదిరిపోయి రేంజ్ లో ఉండడంతో బాలకృష్ణ కూడా అదే స్థాయిలో డాన్స్ చేయడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ పాట థియేటర్లను షేక్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: