18 సంవత్సరాల తర్వాత ప్రభాస్ కి జోడిగా నటించనున్న బ్యూటీ.. ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్..?

frame 18 సంవత్సరాల తర్వాత ప్రభాస్ కి జోడిగా నటించనున్న బ్యూటీ.. ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ చాలా హీరోలా మాదిరిగా కాకుండా వరుసగా సినిమాలను ఓకే చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. దానితో సంవత్సరానికి ప్రభాస్ నటించిన ఒకటి , రెండు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ , మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. అలాగే చాలా రోజుల క్రితమే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఓ మూవీ ఓకే చేశాడు. అలాగే హను రాగవపూడి దర్శకత్వంలో కూడా ఓ మూవీ ని ఓకే చేశాడు. దానితో మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తూనే ఓ వైపు హను రాగవపూడి మరో వైపు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలలో కూడా ప్రభాస్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అనే టైటిల్ తో మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే ఎందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విలువడింది. సందీప్ ఇప్పటికే ప్రభాస్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రభాస్ కి జోడిగా ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ ని సందీప్ సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.

అసలు విషయం లోకి వెళితే ... ప్రభాస్ కెరియర్ బిగినింగ్ లో వర్షం సినిమాలో నటించిన విషయం మనకు తెలిసింది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ జంటకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వీరి కాంబోలో పౌర్ణమి సినిమా రూపొందింది. ఈ సినిమా 2006 లో వచ్చింది. ఇకపోతే దాదాపు 18 సంవత్సరాల తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందబోయే స్పిరిట్ సినిమాలో త్రిష ను సందీప్ రెడ్డి హీరోయిన్గా సెలెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా త్రిష నటించబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: