నేను తుప్పు పట్టిన పిస్ ను.. ఆమెతో పోలుస్తూ అలాంటి విషయం చెప్పేసిన విష్ణు ప్రియ..!

frame నేను తుప్పు పట్టిన పిస్ ను.. ఆమెతో పోలుస్తూ అలాంటి విషయం చెప్పేసిన విష్ణు ప్రియ..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో విష్ణు ప్రియ ఒకరు. ఈమె కెరియర్ ప్రారంభంలో చాలా టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించింది. అందులో ఈటీవీ లో ప్రసారం అయిన పోవే పోరా షో ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఈమె తన యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ షో ద్వారా ఈమెకు ఎంతో మంది బుల్లి తెర అభిమానులు ఏర్పడ్డారు. ఆ తర్వాత కూడా ఈమె బుల్లి తెర లో అనేక షో లకు యాంకర్ గా వ్యవహరించింది. కాకపోతే పోవా పోరా స్థాయిలో అవి సక్సెస్ కాలేదు. ఇకపోతే ఈమెకు టీవీ షో ల ద్వారా మంచి గుర్తింపు రావడంతో సినిమాల్లో , వెబ్ సిరీస్లలో అవకాశాలు రావడం మొదలు అయింది.

దానితో ఈమె ఓ వైపు టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూనే , మరో వైపు సినిమాల్లో , వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ వచ్చింది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే విష్ణు ప్రియ , రీతు చౌదరి కాంబోలో ఒక టీవీ షో ప్రారంభం కాబోతుంది. ఆ సందర్భంగా తాజాగా వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు. అందులో భాగంగా రీతూ చౌదరి కి ఎక్కువ పారితోషకం ఇస్తున్నారా ... లేక మీకు ఎక్కువ పారీతోషకం ఇస్తున్నారా అనే ప్రశ్న విష్ణు ప్రియ కు ఎదురయింది. దానితో నేను ఒక తుప్పు పట్టిన పీసును ... నాకు ఎక్కువ ఇవ్వడం లేదు.

ఈమె ఒక టాక్ షో ద్వారా ఫుల్ ఫేమస్ అయ్యింది. దానితో ఈమెకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అని చెప్పుకొచ్చింది. అలాగే మా ఇద్దరిదీ మంచి స్నేహం. మేము ఎన్నో విషయాలను మాట్లాడుకుంటాం అని విష్ణు ప్రియ చెప్పుకొచ్చింది. అలాగే రీతు కూడా విష్ణు ప్రియ నాకు ఎంతో మంచి స్నేహితురాలు. మేమిద్దరం కలిసి షో చేయడం ఎంతో బాగుంది అని ఈమె తెలియజేసింది. ఇకపోతే ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కలిసి షో చేయనుండడంతో దానిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: