టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో కొరటాల శివ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలకు కథ రచయితగా పని చేశాడు. ఈయన కథ రచయితగా పని చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఈయన రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందిన మిర్చి మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. పక్క మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ మూవీ తో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది. కొరటాల "మిర్చి" మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బండ్ల గణేష్ నిర్మాణంలో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సమయంలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక అంతా ఓకే అయ్యింది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది అనే సమయంలో ఈ సినిమా క్యాన్సల్ అయింది. అసలు ఈ సినిమా క్యాన్సల్ కావడానికి ప్రధాన కారణం ... ఈ మూవీ కి పక్కాగా స్టోరీ లాక్ కాకముందే మూవీ ని అనౌన్స్ చేశారు.
ఆ తర్వాత స్టోరీ డెవలప్మెంట్ ప్రాసెస్ లో కొరటాల శివ అంతగా ఆసక్తి కాలేదట. కొన్ని వర్షన్స్ రాసినా కూడా దానితో కొరటాల సాటిస్ఫై కాలేదట. దానితో ఇదే విషయాన్ని రామ్ చరణ్ కు చెప్పాడట. దానితో ఏముంది సార్ కథ బాగోలేకపోతే వద్దులేండి. మళ్లీ ఎప్పుడైనా సినిమా చేద్దాం. ఇప్పుడే చేయాలని ఏముంది అని చెప్పాడట. దానితో మిర్చి తర్వాత చరణ్ , కొరటాల కాంబోలో రావలసిన సినిమా క్యాన్సిల్ అయింది. ఇక కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ చిన్న పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.