"ఆయ్" మూవీ కోసం పెద్ద స్కెచ్ వేసిన బన్నీ వాసు.. బరిలోకి ఆ ఇద్దరు స్టార్ హీరోలు..?

frame "ఆయ్" మూవీ కోసం పెద్ద స్కెచ్ వేసిన బన్నీ వాసు.. బరిలోకి ఆ ఇద్దరు స్టార్ హీరోలు..?

MADDIBOINA AJAY KUMAR
ఎన్టీఆర్ బావమరిది నార్నీ నితిన్ హీరోగా ఆయ్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు చాలా రోజుల నుండే ఈ సినిమాకి సంబంధించిన ప్రచారాలను జోరుగా చేస్తున్నారు. ఈ సినిమాను బన్నీ బాసు నిర్మించాడు. బన్నీ వాసు ఈ సినిమాపై సూపర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.

ఈ ట్రైలర్ కూడా అధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగానే పెరిగాయి. ఈ సినిమా నిర్మాత అయినటువంటి బన్నీ వాసు ఈ మూవీ లో కామెడీ అద్భుతంగా ఉంటుంది. మీరు చాలా నవ్వుతారు అని హామీ ఇస్తున్నాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆ స్థాయిలో నవ్విస్తుందో లేదో తెలియాలి అంటే ఆగస్టు 15 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను పెద్ద ఎత్తున నిర్వహించాలి అని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా బన్నీ వాసు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్ లను ముఖ్య అతిథులుగా తీసుకురావాలి అని ప్లాన్ చేస్తున్నట్లు అందులో భాగంగా వారితో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఒక వేళ ఈ ఇద్దరు హీరోలు కనుక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా వచ్చినట్లు అయితే ఒక్క సారిగా ఈ మూవీ పై అంచనాలు మరింతగా పెరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది. మరి ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా వస్తారా లేదా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: