సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న 'దేవర' రొమాంటిక్ సాంగ్..

frame సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న 'దేవర' రొమాంటిక్ సాంగ్..

murali krishna
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్  మూవీ ‘దేవర’. ‘RRR’ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ చిత్రంగా ‘దేవర’ రూపొందుతుంది. ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వస్తున్న రెండో చిత్రం కావడంతో మంచి బజ్ క్రియేట్ అవుతోంది.జాన్వీ కపూర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన డ్యూయెట్ రానే వ్చింది. దేవర పార్ట్ 1 నుంచి చుట్టమల్లే చుట్టేస్తాంది తంటరి అనే సాంగ్ వచ్చేసింది. నిజానికి ఇప్పటి వరకు తారక్ ని, జాన్వీ కపూర్ ని ఏ సినిమాలో కూడా ఇంత లవ్లీగా చూసుండరు. ఈ డ్యూయెట్ లో మాత్రం ఎంతో అందంగా, చూడగానే ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. పైగా ఫస్ట్ సాంగ్ కి ఈ సెకండ్ సాంగ్ కి అస్సలు కంపారిజనే లేదు. మొదటి పాటలో తారక్ గురించి వింటే భయమేస్తుంది. ఈ పాటలో తారక్ లుక్స్ చూస్తే అచ్చం లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు. ఇంక జాన్వీ కపూర్ కూడా గతంలో వచ్చిన పోస్టర్ చూస్తే లంగా ఓణీలో కనిపించింది. కానీ, ఈ సాంగ్ లో మాత్రం దేవకన్యలా ఆకట్టుకుంటోంది.టాలీవుడ్ లో ఇలాంటి ఒక డ్యూయెట్ వచ్చి చాలా రోజులు అవుతోంది. అటు మోడ్రన్ సంగీతంతో.. ఇటు తెలుగు సాహిత్యాన్ని కలిపేస్తూ తీసుకొచ్చిన ఈ సాంగ్ కు సినిమా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. హీరో- హీరోయిన్ కాస్ట్యూమ్స్ సెలక్షన్ నుంచి.. లొకేషన్, కొరియోగ్రఫీ, తారక్- జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ మొత్తం పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి.

ఈ సాంగ్ కి ఓవరాల్ గా మంచి మార్కులు పడుతున్నాయి. అలాగే ఈ సాంగ్ లో మరీ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన ఒక అంశం ఉంది. అదే ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ గురించి. ఇవి చిన్నగా ఆడియన్స్ హృదయాన్ని తాకేస్తున్నాయి. ఆడియన్స్ ఎలాగు ఈ సాంగ్ ని కంఠస్తం చేసేస్తారు.ఈ నేపథ్యంలో దేవర నుంచి విడుదలైన చుట్టమల్లె చుట్టేస్తుంది సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుంది. పాటలో ఎన్టీఆర్,జాన్వి కపూర్ రొమాన్స్ అదిరిపోయిందని ఫ్యాన్స్ పోస్ట్ చేస్తున్నారు..అందుకు సంబంధించిన వీడియో క్లిప్పులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.దీంతో జాన్వీ కపూర్, జూనియర్ ఎన్టీఆర్ దేవర హ్యష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ సాంగ్ లో ఎన్టీఆర్ జాన్వి కెమిస్ట్రీ పై భారీ అంచనాలు వున్నాయి.మరి ఎన్టీఆర్ దేవర సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా ఫుల్ మాస్ గా తెరకెక్కుతుంది. సెప్టెంబర్ 27న ఈ సినిమాని గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఒక మాస్ సాంగ్, గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: