తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన కమీడియన్ గా గుర్తింపును సంపాదించుకున్న బ్రహ్మానందం నట వారసుడిగా గౌతమ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈయన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన పల్లకిలో పెళ్లి కూతురు అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఇక రాఘవేంద్రరావు లాంటి గొప్ప దర్శకుడు బ్రహ్మానందం కుమారుడు అయినటువంటి గౌతమ్ ను వెండి తెరకు పరిచయం చేయబోతూ ఉండడంతో ఈ సినిమాపై ఆ సమయంలో ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.
ఇక ఈ మూవీ లోని పాటలు కూడా అద్భుతంగా ఉండడంతో ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని చాలా మంది ప్రేక్షకులు భావించారు. కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత గౌతమ్ కొన్ని సినిమాలలో హీరోగా నటించిన అవి కూడా ఈయనకు పెద్దగా విజయాలను అందించలేదు. దానితో ఈయన కూడా సినిమాలకు దూరంగానే ఉంటున్నాడు. సినిమాలకు దూరంగా ఉంటున్న ఈయన మాత్రం స్టార్ హీరోలకు మించి అధికంగా ఆస్తులను కూడాబేట్టినట్లు తెలుస్తోంది.
చాలా సంవత్సరాలుగా గౌతమ్ అనేక వ్యాపారాలను చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో కమర్షియల్ కాంప్లెక్స్ లు భారీగా గౌతమ్ కి ఉన్నట్లు సమాచారం. వాటిపై వచ్చే ఆదాయాన్ని ఐటి కంపెనీలలో పెట్టుబడి పెట్టినట్లు వాటి నుండి కూడా గౌతమ్ కి భారీగా ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బెంగుళూరు నగరంలో పదుల సంఖ్యలో రెస్టారెంట్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దానితో ఏడాదికి 400 కోట్ల ఆదాయం గౌతమ్ కు వస్తున్నట్లు నెలకు 30 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సంవత్సరానికి 360 కోట్లకు పైగా ఆదాయాన్ని గౌతమ్ ఆర్థిస్తున్నట్లు ఈ స్థాయిలో టాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా ఆదాయం లేదు అని వార్తలు వస్తున్నాయి.