టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో పూరి జగన్నాథ్ ఒకరు. ఈయన కెరియర్ను ప్రారంభించిన కొత్తలో వరస విజాయలను అందుకుంటు చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల స్థాయికి చేరిపోయాడు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం వరుసగా అపజాయలను ఎదుర్కొన్నాడు. అలాంటి సమయం లోనే రామ్ పోతినేని హీరో గా ఈస్మార్ట్ శంకర్ అనే మూవీ ని రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ "లైగర్" అనే మూవీ ని రూపొందించాడు.
మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే పూరి జగన్నాథ్ తాజాగా రామ్ పోతినేని హీరోగా కావ్య ధాపర్ హీరోయిన్గా డబల్ ఇస్మార్ట్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ ను గమనించినట్లయితే ఆలీ పై ఒక సపరేట్ కామెడీ ట్రాక్ ను తయారు చేసినట్లు అర్థం అవుతుంది.
ఇకపోతే పూరి జగన్నాథ్ సినిమాలలో ఆలీ కామెడీ ట్రాక్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే డబల్ ఈస్మార్ట్ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఒక కామెడీ ట్రాక్ ఉంటే బాగుంటుంది అనే ఐడియాతో పూరి జగన్నాథ్ ఆలీ కామెడీ ట్రాక్ ను ఈ సినిమాలో పెట్టినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే పూరి దర్శకత్వంలో రూపొందిన చాలా సినిమాలలో ఆలీ కామెడీ ట్రాక్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. మరి ఈ సినిమాలో కూడా ఆ స్థాయిలో ఆలీ కామెడీ ట్రాక్ వర్కౌట్ అవుతుందేమో చూడాలి.