టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమాలలో హీరోయిన్గా నటించిన వారిలో కొంత మంది ఇప్పటికే సినీ పరిశ్రమలో అవకాశాలు లేవకపోవడంతో ఫెడ్ ఔట్ అయ్యారు. అలాంటి వారు ఎవరో తెలుసుకుందాం.
అల్లు అర్జున్ కొన్ని సంవత్సరాల క్రితం గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన వరుడు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో భాను శ్రీ మెహ్రా హీరోయిన్ గా నటించింది. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత ఈమెకు అవకాశాలు రావడంతో మెల్లి మెల్లిగా ఈమె సినిమా ఇండస్ట్రీకి కూడా దూరం అయింది. అల్లు అర్జున్ కొన్ని సంవత్సరాల క్రితం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పరుగు సినిమాలో హీరోగా నటించాడు.
ఈ సినిమాలో షీలా హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ద్వారా షీలా కు మంచి విజయం , మంచి గుర్తింపు దక్కాయి. కానీ ఆ తర్వాత ఎందుకో ఏమో తెలియదు కానీ ఈమెకు భారీ అవకాశాలు రాలేదు. మెల్లి మెల్లిగా ఈమె కూడా సినిమా ఇండస్ట్రీ కి దూరం అయింది. అల్లు అర్జున్ హీరోగా వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన బన్నీ సినిమాలో గౌరీ మంజల్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. కాకపోతే ఈమెకు ఆ తర్వాత భారీ అవకాశాలు దక్కలేదు. అల్లు అర్జున్ "గంగోత్రి" సినిమా ద్వారా హీరో గా వెండి తెరకు పరిచయం అయ్యాడు.
ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ సోదరి అదితి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ ముద్దుగుమ్మకు కూడా ఈ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం ఆర్య అనే మూవీ రూపొందింది. ఈ మూవీలో అనురాధ మెహతా హీరోయిన్గా నటించింది. ఈ సినిమా తర్వాత ఈమెకు కూడా పెద్దగా అవకాశాలు రాలేదు.