పవన్, రవితేజ లతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న స్టార్ డైరెక్టర్.. ఎవరంటే..!?

frame పవన్, రవితేజ లతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న స్టార్ డైరెక్టర్.. ఎవరంటే..!?

Anilkumar
టాలీవుడ్ మాస్ మహారాజా చేస్తున్న లేటెస్ట్ సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. అయితే త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే హరీష్ శంకర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అయితే మల్టీస్టారర్ తీయాల్సి వస్తే ఎవరితో తీస్తారు అని అడగగా.. పవన్ కళ్యాణ్ రవితేజ తో తీస్తాను అని టక్కున చెప్పేసారు.

అయితే వీళ్ళిద్దరే కాంబినేషన్లు ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు .అంతేకాదు వీళ్ళిద్దరూ టాలీవుడ్ స్టార్ హీరోస్. అలాంటిది వీళ్లిద్దరు కాంబోలో సినిమా వస్తే కచ్చితంగా అది సూపర్ హిట్ అవుతుంది. అందుకే వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుంటుంది అని హరీష్ శంకర్ అవకాశం వస్తే వీళ్లిద్దరితో సినిమా తీస్తాను అని చెప్పారు. దీంతో ఆయన చెప్పిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయ్.. అంతేకాదు   . చాలా మంది చాలాసార్లు అడిగారు. అది కార్యరూపం దాల్చాలని ఆశిద్దాం' అన్నారు.

అలాగే, మహేశ్‌బాబుతోనూ ఒక సినిమా చేయాలని ఉందని అన్నారు. అది తన చిరకాల కోరిక అని అభిప్రాయపడ్డారు. అలాగే, కొన్ని సందర్భాల్లో దర్శకుడిగా తాను ఫెయిల్‌ అయి ఉండవచ్చు. కానీ, తన సినిమాల విషయంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ ఎప్పుడూ ఫెయిల్‌ కాలేదని హరీశ్ శంకర్‌ చెప్పుకొచ్చారు. ఇక 'మిస్టర్ బచ్చన్‌' విషయానికొస్తే, హిందీలో విజయవంతమైన 'రైడ్‌'కు రీమేక్‌గా దీన్ని తీసుకొస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. రవితేజ నటన, హరీశ్‌ శంకర్‌ టేకింగ్‌తో పాటు, భాగ్యశ్రీ బోర్సే అందాలు సినిమాపై అంచాలను పెంచాయి. తొలి సినిమాతోనే సామాజిక మాధ్యమాల వేదికగా యువ హృదయాలను భాగ్యశ్రీ కొల్లగొడుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: