సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్న ఎన్టీఆర్.. అసలు ఏం జరిగిందంటే..!?

frame సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్న ఎన్టీఆర్.. అసలు ఏం జరిగిందంటే..!?

Anilkumar
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల కోసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు సినిమా లవర్స్ అందరూ ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దేవర అనే పవర్ ఫుల్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ,

 సాంగ్స్ సినిమా పై హైప్‌ను క్రియేట్ చేశాయి. రీసెంట్ గా ఈ మూవీ నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు.  చుట్టమల్లే` అంటూ సాగే ఈ సెకండ్‌ సింగిల్‌ని ఈ సాయంత్రం(సోమవారం) విడుదల చేశారు. ఈ సినిమాకి అనిరుథ్‌ రవిచందర్‌ సంగీతం అందించిన విషయం తెలిసిందే.  రామజోగయ్య శాస్త్రి రాయగా, శిల్పా రావు ఆలపించారు. బోస్కో మార్టిస్‌ కొరియోగ్రఫీ చేశారు. రొమాంటిక్‌ మెలోడీ సాంగ్‌ ఇది. ఆద్యంతం అలరించేలా ఉంది. ఇందులో హీరో ఎన్టీఆర్‌, హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ల మధ్య రొమాంటిక్‌ మూమెంట్స్, కెమిస్ట్రీ కట్టిపడేస్తున్నాయి. మరోవైపు దేవర  సెకండ్ సింగిల్ చుట్టూ కొన్ని ట్రోల్స్ వస్తున్నా ఫ్యాన్స్ మాత్రం వాటిని పట్టించుకోకుండా సాంగ్ ను

 ఎంజాయ్ చేస్తున్నారు. దేవర సెకండ్ సింగిల్ ఇతర భాషల వెర్షన్లు సైతం ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. చుట్టమల్లే సాంగ్ లో తారక్ ధరించిన షర్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ ఈకామర్స్ సైట్లలో ఈ షర్ట్ ను కొనుగోలు చేయడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో చాలామంది ఆసక్తి చూపడంతో ఆ షర్ట్ సోల్డ్ ఔట్ అయిన పరిస్థితి నెలకొంది. అప్పుడూ ఇప్పుడూ తారక్ ట్రెండ్ ను సెట్ చేస్తూ ఫ్యాన్స్ ను ఎంతో మెప్పిస్తున్నారు. దేవర సీక్వెల్ షూట్ ఎప్పుడు మొదలవుతుందనే చర్చ జరుగుతుండగా త్వరలో ఈ ప్రశ్నలకు సంబంధించి జవాబు దొరికే అవకాశం అయితే ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: