అల్లు అర్జున్ గురించి ఒక్క మాటలో చెప్పిన నాగబాబు..!?

frame అల్లు అర్జున్ గురించి ఒక్క మాటలో చెప్పిన నాగబాబు..!?

Anilkumar
మెగా డాటర్ నిహారిక నిర్మించిన తాజా చిత్రం కమిటీ కుర్రోళ్ళు. యదు వంశీ తెరకెక్కించిన ఈ మూవీ ఆగస్టు 9న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. సోమవారం కమటి కుర్రోళ్లు ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ నిర్వహించారు. ఇందులో నాగబాబు చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ‘‘ ఈ సినిమాలో చాలామంది కొత్త వాళ్లు అయినప్పటికీ చాలా బాగా నటించారు. అయితే కొంతమంది మాట్లాడితే మెగా ఫ్యామిలీ అని మాపై ఏడుస్తున్నారు. పనికిమాలిన మాటలు మాట్లాడే ఎదవలను చాలా మందిని చూశాను. మాకు అలాంటి ఫీలింగ్ లేదు.

 సినిమా ఇండస్ట్రీ మా నాన్న సామ్రాజ్యం కాదు. మా తాతది కాదు అని నాగబాబు ఆన్సర్ ఇచ్చారు . అలా అని అక్కినేని, నందమూరి కటుంబాలది కూడా కాదు ఇది అందరిదీ. ఇండస్ట్రీ ఎవడబ్బ సొత్తు కాదు. ఇందులో అందరూ సమానమే. అయితే అడవి శేష్ లాంటి ఎంతో మంది నటులు సినిమాలకు సంబంధించిన ఫ్యామిలీ కానప్పటికీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అడివి శేష్ అతని టాలెంట్‌తో పైకి వచ్చాడు. అలాగే ఎంతోమంది తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు. అంతేకాదు నాగబాబు రీసెంట్‍గా ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా

 క్వశ్చన్, ఆన్సర్స్ సెషన్ నిర్వహించారు. నెటిజన్లను ప్రశ్నలు అడగాలని ఆహ్వానించారు. ఆయనకు చాలా ప్రశ్నలు వచ్చాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్‍కు సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. వీటికి ఆయన సమాధానాలు చెప్పారు. 'అల్లు అర్జున్ సంగతి ఏంటి బాబాయ్' అని ఓ నెటిజన్ నాగబాబును అడిగారు. "పుష్ప 2 కోసం వేచిచూస్తున్నా" అని నాగబాబు ఆన్సర్ ఇచ్చారు. వివాదంపై ఏదైనా చెప్పాలనేలా క్వశ్చన్ చేశారు ఆ నెటిజన్. అయితే, పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్నా అంటూ పాజిటివ్ ఆన్సర్ ఇచ్చారు నాగబాబు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: