షాక్: బిగ్ బాస్ షో నుంచి తప్పకుండా కమలహాసన్.. కారణం..?

frame షాక్: బిగ్ బాస్ షో నుంచి తప్పకుండా కమలహాసన్.. కారణం..?

Divya
కోలీవుడ్ ,టాలీవుడ్ లో లోక నాయకుడిగా పేరుపొందిన హీరో కమలహాసన్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఒకవైపు హీరోగా మరొక వైపు బిగ్ బాస్ షో కి హొస్టుగా కూడా తమిళంలో చేస్తూ ఉండేవారు. మొదటి సీజన్ నుంచి తమిళంలో కమలహాసన్ హోస్ట్ గానే ఉన్నారట.. అయితే ఎన్నోసార్లు నెటిజన్స్ సైతం కమలహాసన్ పైన దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. కాని కమలహాసన్ వాటిని అసలు పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉండేవారు. కానీ ఈసారి కూడా కమలహాసన్ హొస్టుగా వ్యవహరిస్తున్నట్లుగా వార్తలు వినిపించాయి. ఈ వార్తల పైన కమలహాసన్ స్పందిస్తూ కొన్ని కారణాల వల్ల బిగ్ బాస్ షో నుంచి తప్పుకున్నట్లుగా తెలియజేశారట.

ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా కమల్ హాసన్ తెలియజేస్తూ ప్రియమైన ప్రేక్షకులారా ఏడు సంవత్సరాల క్రితం మొదలైన మా ప్రయాణం నుండి నేను చిన్న విరామం ఇస్తున్నాను అంటూ తెలియజేశారు. తాను ముందస్తు సినిమాల కమిట్మెంట్ కారణంగానే బిగ్ బాస్ తమిళ నుంచి రాబోయే సీజన్ కి హొస్టుగా చేయలేకపోతున్నానని తెలిపారు. ఇన్నేళ్లు మీ ప్రేమ ఆప్యాయతతో నన్ను ఆదరించారు అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ తెలిపారు. బిగ్ బాస్ అనేది తమిళంలో భారత దేశంలో ఉత్తమమైన రియాలిటీ షోలో ఒకటి అని తెలిపారు.

నేను నిజాయితీగా నా భావాలను సైతం పంచుకున్నాను అంటూ కమలహాసన్ తెలిపారు. ఇప్పటివరకు తనతో పని చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటు తెలిపారు. ఇన్నేళ్లపాటు విజయ్ టీవీ తో తనకున్న అద్భుతమైన  అనుబంధాన్ని అలాగే ఆ సంస్థను విజయవంతంగా చేయడంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు కమలహాసన్. మరి ఈ సీజన్ కి పోస్టుగా ఎవరొస్తారా అంటూ తమిళ ప్రేక్షకులు సైతం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కమలహాసన్ షేర్ చేసిన ఈ పోస్ట్ సైతం వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: