నాని శ్రీకాంత్.. ఏంటా కాకి కథ..?
ఈ ఇద్దరికి ఈ ఇయర్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో బెస్ట్ డబట్ డైరెక్టర్ గా అవార్డ్ వచ్చింది. ఇలా కొత్త టాలెంట్ ని ప్రోత్సహిస్తూ హిట్లు కొడుతూ వారితో అవార్డులు అందుకునేలా చేయడం గొప్ప విషయమే. ఇక లేటెస్ట్ గా శ్రీకాంత్ అవార్డ్ తీసుకున్న టైం లో అతన్ని వెనక్కి చూపించి శ్రీకాంత్ షర్ట్ మీద ఉన్న కాకి గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ ఆ కాకి అవార్డులన్ని ఎత్తుకెళ్లి పోతుంది అన్నాడు.
నాని ఆ మాట అన్న దగ్గర నుంచి నాని శ్రీకాంత్ ఓదెల సినిమాపై మరింత బజ్ పెరిగింది. ఆల్రెడీ దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక నాని మళ్లీ శ్రీకాంత్ తో దాన్ని మించి సినిమా చేసేందుకు రంగ సిద్ధం చేస్తున్నాడు. నాని శ్రీకాంత్ ఓదెల దసరా నిర్మాత కలిసి మళ్లీ ఒక క్రేజీ మూవీ ప్లాన్ చేస్తున్నారు. తప్పకుండా నాని చెప్పినట్టు ఈసారి కూడా రికార్డుల్లో నాని సినిమా మోత మోగిస్తుందేమో చూడాలి. ఐతే నెక్స్ట్ ఇయర్ రేసులో చాలా సినిమాలు ఉంటాయి అయినా కూడా నాని అంత కాన్ ఫిడెంట్ గా చెప్పాండంటే సినిమా వేరే లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ లో సెట్స్ మీదకు తీసుకెళ్లి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని టాక్.