మహాలక్ష్మి డిమాండ్ బాగుందిగా..?

frame మహాలక్ష్మి డిమాండ్ బాగుందిగా..?

shami
బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడ నుంచి టాలీవుడ్ షిఫ్ట్ అయిన మృణాల్ ఠాకూర్ హిందీలో బుల్లితెర మీద నుంచి సిల్వర్స్ స్క్రీన్ ఆ తర్వాత సౌత్ సినిమాల్లో తన సత్తా చాటుతుంది. తెలుగులో సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్న మృణాల్ ఠాకూర్ ఆ సినిమాతో తెలుగు యూత్ ఆడియన్స్ మనసులు దోచేసింది. ఇక ఆ తర్వాత వెంటనే హాయ్ నాన్న సినిమాతో మరో సక్సెస్ అందుకుంది. మృణాల్ ఠాకూర్ థర్డ్ సినిమా ది ఫ్యామిలీ స్టార్ మాత్రం నిరాశ పరిచింది. ఐతే అమ్మడు తన నెక్స్ట్ సినిమా భారీ ఆఫర్ అందుకుందని తెలుస్తుంది.
ప్రభాస్ హను రాఘవపుడి కాంబో సినిమాలో మృణాల్ నటిస్తుందని టాక్. ఐతే ఈ సినిమా లో నటించేందుకు గాను అమ్మడు బ్లాస్టింగ్ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. అంటే దాదాపు ఇప్పుడు మృణాల్ ఒక సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ కన్నా అది డబుల్ అని టాక్. ప్రభాస్ హను కాంబో సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సినిమా బడ్జెట్ కోసమే 300 కోట్ల దాకా పెట్టబోతున్నారని టాక్. ఐతే అందులో ప్రభాస్ రెమ్యునరేషన్ 100 కోట్ల పైన ఉండబోతుందట.
హీరోయిన్ మృణాల్ కి కూడా 8 కోట్ల దాకా అందిస్తున్నారని టాక్. మృణాల్ కి బాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉంది కాబట్టి అక్కడ ఇక్కడ ఆమె ఇమేజ్ ఉపయోగపడుతుందని అమ్మడికి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకుంటున్నారు. ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో మృణాల్ ఒక క్యామియో రోల్ చేసింది. తనకు సీతారామం లాంటి హిట్ ఇచ్చిన ప్రొడక్షన్ కదా అని మృణాల్ కల్కిలో తన రోల్ ఏంటి అని ఆలోచించకుండా చేసింది. ఐతే సినిమాలో ఆమె కనిపించడం వల్ల తెలుగులో ఆమెకు ఉన్న వెయిట్ ఏంటన్నది అర్ధమైంది. అందుకే ప్రభాస్ నెక్స్ట్ సినిమాలో ఆమెను మెయిన్ లీడ్ గా ఓకే చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: