ఏంటి.. 'పొన్నియన్ సెల్వన్' లో.. ముందు మహేష్ బాబుని అనుకున్నారా?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరో హీరో చేయడం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం అన్న విషయం తెలిసిందే. ఇలా ఒక హీరో రిజెక్ట్ చేసిన స్టోరీ తోనే మరో హీరో సూపర్ హిట్ కొడుతూ ఉంటాడు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఇలా ఒక హీరో రిజెక్ట్ చేసిన స్టోరీ తోనే సినిమా చేసి బ్లాక్బస్టర్లు కొట్టి స్టార్ హీరోలుగా ఎదిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరికొన్నిసార్లు ఒక హీరో కోసం కథ రాసుకుంటే ఆ హీరో డేట్ ఫిక్స్ కాకపోవడంతో.. ఇక అదే రోల్ లో మరో హీరోని తీసుకుంటూ ఉంటారు.

 అయితే సినిమా విడుదలైన చాలా రోజుల తర్వాత ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలోకి వచ్చి ఇక వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పోనియన్ సెల్వన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మణిరత్నం కెరియర్ లోనే ఈ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఏ మూవీ రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో భారీ తారాగణం ఉండడంతో ప్రేక్షకులు అందరూ కూడా మూవీ చూసి సర్ ప్రైస్ అయ్యారు  అయితే ఇక ఇప్పుడు ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తాను తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాకు ముందుగా వేరే హీరోలని అనుకున్నాడట  ఈ సినిమా తీసేందుకు 2012 లోనే డైరెక్టర్ భారీగా ప్లాన్ చేశాడట. మహేష్ బాబు, దళపతి విజయ్ ప్రధమ పాత్రలో ఉండాలని అనుకున్నాడట. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాకు సంబంధించి ఫోటోషూట్ కూడా పూర్తి చేశారట. కానీ అప్పుడు బడ్జెట్ తక్కువగా ఉండడం పరిమిత, విఎఫ్ఎక్స్ అందుబాటులో ఉండడంతో ఈ సినిమాను నిలిపివేశారట. ఇక ఆ తర్వాత 2022లో విక్రమ్, కార్తి, జయం రవి లతో ఈ సినిమాను భారీ బడ్జెట్లో తెరకేక్కించారు. ఇక ఈ మూవీ సూపర్ హిట్ సాధించింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: