మహేష్ బాబు నటించిన కల్ట్ క్లాసిక్ చిత్రం 'మురారి' రీ రిలీజ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా 4K రిజల్యూషన్‌లో రీ రిలీజ్ కానున్న ఈ చిత్రం, ప్రీ రిలీజ్ బుకింగ్స్‌తోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో టాలీవుడ్‌లో పాత బ్లాక్‌బస్టర్లు, కల్ట్ చిత్రాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. 'ఒక్కడు', 'పోకిరి', 'జల్సా', 'కుషి', 'సిమ్హాద్రి', 'ఆరంజ్', 'దేశముదురు', 'బిజినెస్‌మన్' వంటి చిత్రాలు రీ రిలీజ్ అయి విజయవంతం అయ్యాయి. ఈ క్రమంలోనే 'మురారి' కూడా రీ రిలీజ్
అవుతుండటంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ రిలీజ్ బుకింగ్స్ విషయంలో 'మురారి' అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. ఇప్పటి వరకూ ఏ రీ-రిలీజ్ కి సాధ్యం కానీ రికార్డును క్రియేట్ చేసింది ఈ సినిమా. రిలీజ్ కి ముందే 2 కోట్ల రూపాయల గ్రాస్ ను వేగవంతంగా రాబట్టిన చిత్రంగా నిలిచింది మురారి. సోనాలి బింద్రే, లక్ష్మీ, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి అధ్బుతమైన సంగీతం అందించారు. ఇంకా రిలీజ్ కు 2
రోజులు ఉండగానే ఈ స్థాయిలో బుకింగ్స్ జరగడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. 'మురారి' సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అప్పట్లో విశేషమైన విజయాన్ని సాధించింది. మహేష్ బాబు కెరీర్‌లో మలుపు తిప్పిన చిత్రంగా ఈ సినిమా నిలుస్తుంది. ఇప్పుడు మళ్లీ తెరపైకి రానుండటంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పుడు 'మురారి' రీ రిలీజ్ సక్సెస్ అవ్వడం వల్ల ఇతర చిత్రాల రీ రిలీజ్‌లకు కూడా బాటలు పరుస్తుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ట్రెండ్ ఇంకా కొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. భవిష్యత్తులో మరెన్ని పాత హిట్ చిత్రాలు రీ రిలీజ్ అవుతాయో చూడాలి మరి.