యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ , ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... బాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులు అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ , బాబీ డియోల్ ఈ మూవీ లో విలన్ పాత్రలలో నటిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది.
అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో పాటను విడుదల చేస్తూ వస్తోంది. అందులో భాగంగా కొంత కాలం క్రితం ఫియర్ అంటూ సాగే మొదటి పాటను ఈ మూవీ బృందం విడుదల చేయగా దానికి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి రొమాంటిక్ సాంగ్ అయినటువంటి చట్టమల్లే అంటూ సాగే పాటను విడుదల చేసింది.
ఈ సాంగ్ విడుదల అయిన తక్కువ సమయంలోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సాంగ్ కి రిలీజ్ అయిన 24 గంటల్లో 15.68 మిలియన్ వ్యూస్ , 497.7 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే దేవర మూవీ లోని సెకండ్ సింగిల్ కి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ నుండి విడుదల చేసిన రెండు పాటలు కూడా సూపర్ గా ఉండడంతో ఈ మూవీ పై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి.