35-చిన్న కథ కాదు రిలీజ్ డేట్ మారిందా..?

frame 35-చిన్న కథ కాదు రిలీజ్ డేట్ మారిందా..?

Anilkumar
తెలుగు సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటున్న చిత్రం '35 - చిన్న కథ కాదు'. నివేదా థామస్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆమె న‌టించే సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యాల‌ను అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె కొంత  గ్యాప్ త‌రువాత తాజాగా నటిస్తున్న  సినిమా ”35 – చిన్న‌ క‌థ కాదు”. ఇక ఇందులో ఆమె ఒక గృహిణి పాత్రలో నడుస్తుంది. నంద‌కిషోర్ ఈమ‌ని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో నివేదా తో పాటు  విశ్వ‌దేవ్ రాచ‌కొండ‌, ప్రియ‌ద‌ర్శి, గౌతమి,

 భాగ్య‌రాజ్, కృష్ణ‌తేజ‌, అరుణ్ దేవ్, అన‌న్య త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా విషయానికి వస్తే 35 ఏళ్ల వయసులో ప్రేమ, జీవితం, సంబంధాల గురించి చూపిస్తూ సాగుతున్న ఈ సిరీస్, యూత్‌కు బాగా కనెక్ట్ అవుతోంది. ప్రతి క్యారెక్టర్‌కు ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉండటం, వాటిని తెరపై చూపించే విధానం ప్రేక్షకులను అలరిస్తోంది. కాగా ఫీల్ గుడ్ ఎంట‌ర్టైన‌ర్ గా రానున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్ట‌ర్స్, టీజ‌ర్, వీడియో గ్లింప్స్ లు ఈ సినిమాపై భారీ అంచ‌నాల‌ను పెంచాయి. ఇక ఈ సినిమా రిలీజ్ కి

 సంబంధించి తాజాగా ఓ వార్త ఇప్పుడు సినీ జోరుగా చ‌క్క‌ర్లు సాగుతున్నాయి. అది ఏంటంటే...ఈ సినిమాను తొలుత ఆగస్ట్ 15న రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. కానీ ఆ రోజున కొన్ని మేజ‌ర్ మూవీస్ రిలీజ్ అవుతుండ‌టంతో ’35’ చిత్రాన్ని వాయిదా వేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 5న రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. అయితే ఇప్పుడు ఈ విష‌యంపై మేక‌ర్స్ మరింత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఇక ఈ సినిమాకు వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: