తమిళ నటుడు
సూర్య హీరోగా నయన
తార , అసిన్ హీరోయిన్లుగా ఏ ఆర్
మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన గజినీ
మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ
సినిమా తెలుగు ,
తమిళ భాషల్లో విడుదల అయ్యి రెండు భాషలలో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇంతటి విజయం సాధించిన ఈ సినిమాను చాలా మంది హీరోలు రిజెక్ట్ చేశారు. ఇక
అజిత్ ఏకంగా ఈ
సినిమా షూటింగ్ ను మొదలు పెట్టి ఆ తర్వాత ఆపేశాడు. అసలు ఈ సినిమాలో ఎంత మంది హీరోలు రిజెక్ట్ చేశారు.
అజిత్ ఎందుకు ఈ
సినిమా షూటింగ్ నీ మొదలు పెట్టి ఆపేశాడు అనే వివరాలను తెలుసుకుందాం. ఏ ఆర్ మురగదాస్ ఈ
సినిమా కథను పూర్తిగా తయారు చేసుకున్న తర్వాత
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మహేష్ బాబుకు వినిపించాడట. కాకపోతే మహేష్ బాబు ఈ
సినిమా చేయను అని చెప్పాడట. ఆ తర్వాత
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మరో స్టార్
హీరో అయినటువంటి పవన్
కళ్యాణ్ కు కూడా ఈ
సినిమా కథను వినిపించారట. పవన్
కళ్యాణ్ కూడా ఈ
సినిమా చేయను అని అన్నాడట.
ఆ తర్వాత
కోలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి కమల్ హాసన్ కు కూడా ఈ స్టోరీని వినిపించగా ఆయన కూడా చేయను అని అన్నాడట. ఇక
అజిత్ కి ఈ
సినిమా స్టోరీ వినిపించగా ఆయన మాత్రం ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ తర్వాత శ్రేయ ,
ఆసిన్ చేయాలను హీరోయిన్లుగా తీసుకొని ప్రకాష్ రాజు విలన్ గా ఈ సినిమాను మొదలు పెట్టారట. నాలుగు రోజుల షూటింగ్ పూర్తి అయ్యాక ఎందుకో గాని
అజిత్ ఈ
సినిమా చేయట్లేదు అని ప్రకటించాడు. దానితో
మురుగదాస్ ,
సూర్య హీరోగా ఈ సినిమాను
గజిని అనే పేరుతో తెరకెక్కించడం , ఇది విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించడం జరిగింది.