అలాంటి సినిమాలు చేయొద్దంటూ బాలయ్య ను వేడుకుంటున్న ఫ్యాన్స్..?
హరీష్ శంకర్ ...రీమేక్స్ చేయటంలో సిద్దహస్తుడు. ఒరిజనల్ వాళ్లు కూడా వచ్చి హరీష్ శంకర్ రీమేక్ చేసిన సినిమా రైట్స్ మళ్లీ కొనుక్కుని రీమేక్ చేసుకోవాలనించే స్దాయిలో ఉంటుంది. గబ్బర్ సింగ్ , గద్దల కొండ గణేష్ తో హరీష్ శంకర్ ఆ పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హిందీ చిత్రం రైడ్ రీమేక్ మిస్టర్ బచ్చన్ తో మన ముందుకు వస్తున్నాడు. డైలాగ్స్ అయితే మామూలుగా రాయడు. బాలయ్య , హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది. అందుకే ఓ వెర్షన్ రాసి బాలయ్యకు వినిపించబోతున్నారట. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి మాటలే.. ఎందుకంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు.
ఆవేశం కథ బాలకృష్ణ ఇమేజ్‌కు ఈ కథ సూటవ్వదని, బాలయ్య ఇమేజ్, ఫహద్ ఫాజల్ ఇమేజ్ రెండూ వేర్వేరని, ఇద్దరికీ మ్యాచ్ అయ్యే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఇవన్నీ గుర్తు చేస్తూ సోషల్ మీడియా సాక్షిగా రిక్వెస్టులు చేస్తున్నారు. అయినా ఓటిటిలు వచ్చాక ఆల్రెడీ ఆ సినిమాలను జనం చూసేసి ఉంటున్నారు కాబట్టి, పెద్దగా ఉపయోగపడదని వాదిస్తున్నారు.మరో ప్రక్క ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నిజానికి బాలయ్య రీమేక్ చేయడానికి ఏమాత్రం సముఖంగా లేడని తెలుస్తోంది. ఈ సినిమా అనే కాదు, అసలు రీమేకే చేయకూడదని బాలయ్య నిర్ణయం తీసుకొన్నాడని చెప్తున్నారు. అయితే ఆవేశం సినిమా మాత్రం బాలయ్యకు నచ్చిందిట. హరీష్ శంకర్ డైరక్టర్ గా ఓ వెర్షన్ వినిపిస్తాడని సమాచారం..