ఆ హీరోని హగ్ చేసుకోవాలనుంది.. వైరల్ అవుతున్న నిహారిక రెండో పెళ్లి వార్తలు..?

frame ఆ హీరోని హగ్ చేసుకోవాలనుంది.. వైరల్ అవుతున్న నిహారిక రెండో పెళ్లి వార్తలు..?

Pandrala Sravanthi
మెగా డాటర్ నిహారిక భర్తకు విడాకులు ఇచ్చినప్పటి నుండి రెండో పెళ్లి వార్తలు మీడియాలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారిపోయాయి.. మరీ ముఖ్యంగా ఆమె నేను రెండో పెళ్లి చేసుకుంటాను. పెళ్లికి ఏమీ వ్యతిరేకం కాదు. నచ్చినవాడు దొరికితే కచ్చితంగా చేసుకుంటాను అని ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ వార్తలు మరింత ఊపమందుకున్నాయి. ఇక ఈమె మొదటి పెళ్లి చెడిపోవడానికి ఎన్నో కారణాలు ఇప్పటికే తెరమీద వినిపించాయి. కానీ అందులో ఏది నిజమో ఏది అబద్దమో చాలామందికి తెలియదు. అయితే తాజాగా కమిటీ కుర్రోళ్లు సినిమా ప్రమోషన్స్లో నిహారిక పాల్గొంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటుంది ఇదిలా ఉంటే తాజాగా గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఎప్పుడు నెట్టింట్లో  వైరల్ గా మారాయి. నిహారిక మాట్లాడిన ఆ మాటలతో ఈమె రెండో పెళ్లి వార్తలు మరొక సారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇంతకీ నిహారిక ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడింది.. రెండో పెళ్లి వార్తలు ఎందుకు వైరల్ అవుతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం.. 

నాగబాబు కూతురు నిహారిక ప్రస్తుతం కమిటీ కుర్రాళ్ళు అనే మూవీకి నిర్మాతగా చేస్తుంది. ఈ సినిమా ఆగస్టు 9న విడుదలకు సిద్ధంగా ఉంది.దాంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీలోని వారి గురించి నిహారిక ని యాంకర్ అడగగా.. పవన్ కళ్యాణ్ కి విల్ పవర్ ఎక్కువని, అలాగే చిరంజీవి పెదనాన్న కష్టజీవి చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఆయన నుండి అది నేర్చుకోవచ్చు అని చెప్పింది. అలాగే అల్లు అర్జున్ నవ్వంటే తనకెంతో ఇష్టమని ముఖ్యంగా జులాయి మూవీలో కోడి కూడా పొద్దున్నే లేస్తుంది ఏం చేస్తుంది కోసుకొని తినేస్తాం అని చెప్పిన సమయంలో ఆయన ఫన్ అంటే ఎంతో ఇష్టం అని చెప్పింది. అలాగే సాయి ధరంతేజ్ ని చూస్తే ఏమనిపిస్తుంది అని యాంకర్ అడగగా.. కాసేపు ఆలోచించింది.

మైండ్లో ఆయనను చూడగానే ఏ మెదులుతుంది అని మరొకసారి అడగగా. మా బావని చూస్తే నాకు ఇలా ఒక వార్మ్ హగ్ ఇవ్వాలనిపిస్తుంది అంటూ మాట్లాడింది. అయితే అప్పటి ఓల్డ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్స్. అంతేకాదు ఈ వీడియో కింద షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు..సాయి ధరంతేజ్ ని రెండో పెళ్లి ఏమైనా చేసుకుంటావా ఏంటి.. వార్మ్ హగ్ అంటూ మాట్లాడుతున్నావ్ అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే చాలా రోజుల నుండి సాయి ధరంతేజ్ నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతుందనే రూమర్స్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: