బాలయ్య అన్‍స్టాపబుల్ నాలుగో సీజన్‍ పై స్టన్నింగ్ అప్డేట్..?

frame బాలయ్య అన్‍స్టాపబుల్ నాలుగో సీజన్‍ పై స్టన్నింగ్ అప్డేట్..?

murali krishna
టాలీవుడ్ నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య బాబు ప్రస్తుతం మరో స్టార్ డైరెక్టర్‌తో ఓ మూవీ చేస్తున్నాడు. ‘వాల్తేరు వీరయ్య’ ఫేం బాబీ దర్శకత్వంలో ‘NBK 109’ వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ చేస్తున్నాడు.ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా గ్లింప్స్‌లో బాలయ్య బాబు వేటాడిన తీరు చూస్తుంటే.. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌ సినిమాలా అనిపిస్తుంది. ఎగసిపడి పై పైకి లేస్తున్న మంటల వద్ద విలన్లను రెండు గొడ్డళ్లతో వేటాడిన తీరు ఫ్యాన్స్‌కు బాగా నచ్చేసింది.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే బాలయ్య బాబు ఓ వైపు సినిమాలతోనూ మరో వైపు కొన్ని షోలకు హూస్ట్‌గా కూడా దుమ్ము దులిపేస్తాడు. అందులో ఒకటి ‘అన్‌స్టాపబుల్’. ఒకరకంగా చెప్పాలంటే ఈ షోకు నట సింహం బాలయ్య బాబు వల్లనే మంచి ఆదరణ లభించిందని చెప్పాలి. ఈ షోలో బాలయ్య మాటలు, డైలాగ్స్, కామెడీ మామూలుగా ఉండదు.అయితే, త్వరలో పూర్తిస్థాయిలో అన్‍స్టాపబుల్ సీజన్ 4 వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సీజన్ ఎప్పుడు మొదలుకానుందో తాజాగా సమాచారం బయటికి వచ్చింది.అన్‍స్టాపబుల్ నాలుగో సీజన్‍ను దసరా సందర్భంగా ప్రారంభించాలని ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ సిద్దమైనట్టు తెలుస్తోంది. ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‍ను అక్టోబర్ 12వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టే ఇప్పటికే ప్లాన్ చేస్తోందని సమాచారం.


బాలకృష్ణ ప్రస్తుతం బాబీ కొల్లితో మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబర్ తొలివారంలోగా పూర్తి అవుతుందని అంచనాలు ఉన్నాయి. అన్‍స్టాపబుల్ 4వ సీజన్ కోసం సెప్టెంబర్ మూడో వారం నుంచి బాలకృష్ణ షూటింగ్‍లో పాల్గొంటారని సమాచారం. ఇలా అయితే, దసరాకు తొలి ఎపిసోడ్ తీసుకురావొచ్చని ఆహా ఆలోచిస్తోంది.అన్‍స్టాపబుల్ విత్ ఎన్‍బీకే నాలుగో సీజన్ గురించి త్వరలోనే ఆహా అధికారిక ప్రకటన చేయనుంది. త్వరలోనే అంటూ అప్‍డేట్‍ను సిద్దం చేస్తోందని సమాచారం. అన్నీ అనుకున్న విధంగా ప్లాన్ ప్రకారం సాగితే.. దసరా పండుకకు అన్‍స్టాపబుల్ సీజన్ 4 తొలి ఎపిసోడ్ వస్తుంది.ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి వీరమాస్ అనే టైటిల్ పెట్టాలని యోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణని బాబీ ఒక అవుట్ అండ్ డౌట్ మాస్ లుక్ లో చూపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత నందమూరి బాలకృష్ణ బోయపాటి సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే సింహా, లెజెండ్, అఖండ లాంటి సినిమాలతో వీరిద్దరి కాంబినేషన్ అంటేనే పూర్తిస్థాయి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు వీరి కాంబినేషన్లో మరో సినిమా అనగానే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: