తన పెళ్లిపై కీలక అప్డేట్ ఇచ్చిన ఆ కోలీవుడ్ స్టార్ బ్యూటీ..!!

frame తన పెళ్లిపై కీలక అప్డేట్ ఇచ్చిన ఆ కోలీవుడ్ స్టార్ బ్యూటీ..!!

murali krishna
ప్రస్తుతం కోలీవుడ్‌ లో వరుసగా సినిమాలు చేస్తోన్న క్రేజీ హీరోయిన్లలో ప్రియా భవానీ శంకర్ ఒకరు. ఇటీవలే కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 సినిమాలోనూ నటించిందీ అందాల తార. అంతకు ముందు ధనుష్, విశాల్, శింబు, కార్తి తదితర స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది ప్రియ. అన్నట్లు ఈ ముద్దుగుమ్మ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. సంతోష్ శోభన్ తో కలిసి కల్యాణం కమనీయం అనే సినిమాలో నటించిందామె. అలాగే అక్కినేని నాగ చైతన్యతో కలిసి ధూత వెబ్ సిరీస్‌లో కనిపించింది. అలాగే గోపీచంద్ భీమా సినిమాలోనూ హీరోయిన్ గా మెప్పించింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ప్రియా భవానీ శంకర్ త్వరలోనే తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది.తమిళ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ గుడ్ న్యూస్ చెప్పారు.వాళ్లింట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి.వచ్చే ఏడాది ప్రియా భవాని పెళ్లి పీటలు ఎక్కబోతున్నానంటూ తన ఫ్యాన్స్‌కి షాకిచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ప్రియా పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి గురించి నెట్టింట వెతకడం స్టార్ట్ చేశారు నెటిజన్స్.ఇక టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య నటించిన దూత సిరీస్‌లో యాక్ట్ చేసిన హీరోయిన్ ప్రియా భవాని శంకర్ తెలుగులో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు.ఇక తాజాగా కమల్‌హాసన్ హీరోగా వచ్చిన భారతీయడు 2లో కూడా కీరోల్ చేశారు ఆమె.

అయితే గత కొంతకాలంగా ప్రియా భవాని శంకర్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల ఆమె దగ్గర ప్రస్తావించగా పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చారు. రాజవేల్ నేను పదేళ్లుగా రిలేషన్ లో ఉన్నామని తెలిపింది. 
అంతేకాదు మేమిద్దరం చాలాకాలంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము. సమయం దొరకడం లేదు. వచ్చే ఏడాది తప్పకుండ చేసుకుంటాము అంటూ ప్రియా చెప్పుకొచ్చింది.
దీంతో ఈ నటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిమానులు, నెటిజన్లు ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.‘నేను సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందునుంచే రాజ్‌తో ప్రేమలో ఉన్నాను. అయితే మేమిద్దరం బ్రేకప్ చెప్పుకున్నామంటూ ఇప్పటికే ఎన్నోసార్లు పుకార్లు షికార్లు చేశాయి. మేం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటివరకూ నేను చాలామంది నటులతో కలిసి పని చేశాను. వారితో ఉన్న చనువు, స్నేహం కారణంగా పుట్టిన రోజు లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలో వారికి విషెస్ చెబుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేదాన్ని. అంతే.. అలా పోస్ట్ పెట్టడమే ఆలస్యం.. హీరోలతో నాకు రిలేషన్ కట్టబెట్టేవారు. అదృష్టం కొద్దీ ఇప్పుడు నాతో నటించిన హీరోల్లో దాదాపు అందరికీ పెళ్లయిపోయంది’ అని చెప్పుకొచ్చిందీ అందాల తార.ప్రస్తుతం  ‘డెమోంటే కాలనీ 2’  సినిమాలో నటిస్తోంది ప్రియా భవానీ శంకర్.  త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లోనే ఆమె పెళ్లి గురించి ప్రస్తావించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: