కల్కి వర్సెస్ మార్టిన్.. హీరో ఏమన్నాడంటే..?

frame కల్కి వర్సెస్ మార్టిన్.. హీరో ఏమన్నాడంటే..?

shami
కన్నడలో యువ హీరోగా అక్కడ మంచి ఇమేజ్ సంపాదించిన ద్రువ సర్జా ప్రస్తుతం మార్టిన్ అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాను కథ అర్జున్ సర్జా అందించారు. ఏపీ అర్జున్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అక్టోబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ కార్యమం ముంబైలో జరిగింది. ఐతే అక్కడ మార్టిన్ సినిమా కల్కి కలెక్షన్స్ ను బీట్ చేస్తుందా అన్న ప్రశ్న ధ్రువ సర్జాకి ఎదురైంది. ఐతే దానికి అతను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రభాస్ ఒక సూపర్ స్టార్ ఆయన సినిమాకు పోటీ కాదు.
మార్టిన్ ఒక డిఫరెంట్ ప్రయత్నం. ఈ టైం లో భగద్గీతకు సంబందించిన ఒక లైన్ చెబుతాను. మనం ఒక పని కోసం 100 శాతం కష్టపడితే మనకు రావాల్సిన ఫలితం వస్తుంది. మార్టిన్ సినిమా కోసం నేను నా 100 శాతం ఇచ్చాను రిజల్ట్ ఎలా వస్తుందో చూడాలి. ఇక్కడ ప్రేక్షకులే దేవుళ్లు అంటూ చెప్పాడు ధ్రువ సర్జా. కన్నడ నుంచి వచ్చి కె.జి.ఎఫ్ తో పాన్ ఇండియా కొట్టిన యష్ తరహాలోనే ధ్రువ సర్జా కూడా వరుస ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఐతే ఈసాఇ ముంబై మార్కెట్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు ధ్రువ సర్జా. రీసెంట్ గా రిలీజైన మార్టిన్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐతే మార్టిన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో భారీ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు ధ్రువ సర్జా. మరి అతని అటెంప్ట్ ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ధ్రువ సర్జా సినిమా తెలుగులో కూడా మంచి పాపులారిటీ తెచ్చుకునేలా ప్రయత్నం చేస్తున్నారు. అక్టోబర్ లో దసరా బరిలో బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమవుతున్న మార్టిన్ ధ్రువ సర్జాకు అతను ఆశించిన విజయాన్ని అందిస్తుందా లేదా అన్నది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: