ట్రైలర్: రవితేజ ఈజ్ బ్యాక్.. Mr. బచ్చన్ అదుర్స్..!
ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇలాంటి బజ్ లేని ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసే సమయానికి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. నిన్నటి రోజున చిత్ర బృందం ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయగా మొదటి డైలాగు నుంచి మేకర్స్ ఆకట్టుకునేలా చేశారు. ట్రైలర్లో రవితేజ డైలాగులతోనే అదరగొట్టేసేలా కనిపిస్తున్నారు. మిస్టర్ బచ్చన్ చిత్రంలో రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా కనిపిస్తే బోతున్నారు.
ఈ సినిమా ట్రైలర్ లో కూడా రవితేజ హీరోయిన్స్ మధ్య జరిగే రొమాన్స్ డ్రామా సన్నివేశాలు కూడా యూత్‌ని బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. టైటిల్ రోల్ రవితేజ నటన మరొకసారి కనిపించబోతోంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన అంద చందాలతో మరొకసారి ఆకట్టుకునేలా కనిపిస్తోంది. అలాగే కామెడీ టైమింగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో జగపతిబాబు, సత్య, నెల్లూరు సుదర్శన్ తదితర సినిమా సెలబ్రిటీలు సైతం కీలకమైన పాత్రలో నటించబోతున్నారు. ఈ సినిమాతో ఖచ్చితంగా రవితేజ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటారని అభిమానులు సైతం ధీమాని తెలియజేస్తున్నారు. మరి పూర్తిగా తెలియాలి అంటే ఆగస్టు 15 వరకు ఆగాల్సిందే.