తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడు కూడా పెద్ద సినిమాలు విడుదల అవుతూ వాటితో పాటు ఏదైనా చిన్న సినిమా విడుదల అవుతుంది అంటే చిన్న సినిమా వారు థియేటర్లు అన్ని పెద్ద సినిమాలకే ఇచ్చేశారు. చిన్న సినిమాలకు థియేటర్లు లేవు. ఇలా అయితే చిన్న సినిమాలు బ్రతకడం ఎలా. పెద్ద సినిమాల వాళ్లకు థియేటర్స్ ఉంటాయి. వారు ఎంచక్కా విడుదల చేసుకుంటారు. కష్టాలు అన్ని చిన్న సినిమాల వారికే అనే ప్రతిపాదనలు ప్రతిసారి వస్తు ఉంటాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యంత క్రేజ్ కలిగిన నిర్మాతలలో బన్నీ వాసు ఒకరు. ఈయన అల్లు అరవింద్ , అల్లు అర్జున్ లకు అత్యంత ఆప్తుడు. ఈయన దాదాపు ఏ పని చేయాలి అన్నా కూడా వారి పర్మిషన్ లేకుండా చేయడు.
అలాగే వారు కూడా ఇతనికి ఎంతో గొప్ప గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. తాజాగా గీత ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు ఎన్టీఆర్ బావమరిది నార్ని నితిన్ హీరోగా ఆయ్ అనే సినిమాని రూపొందించాడు. ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో పాటు రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన డబల్ ఇస్మార్ట్ , రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ సినిమాలు కూడా ఇదే తేదీన విడుదల కానున్నాయి. ఇక ఈ రెండు సినిమాలు పెద్ద సినిమాలు కావడం , మంచి క్రేజ్ ఉన్న హీరోలు నటించడం , టాప్ దర్శకులు ఈ మూవీలకి దర్శకత్వం వహించడంతో ఆయ్ మూవీ తో పోలిస్తే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇకపోతే తాజాగా బన్నీ వాసు మాట్లాడుతూ ... మాది చిన్న సినిమా. రెండు పెద్ద సినిమాలు విడుదలకు ఉండడంతో మాకు థియేటర్లు దొరకడం లేదు అని చెప్పుకొచ్చాడు. దానితో ఒక విలేకర్ ... అల్లు అరవింద్ దగ్గర చాలా థియేటర్లు ఉన్నాయి అంటారు కదా అందులో విడుదల చేయొచ్చు కదా అనే ప్రశ్నను అడిగాడు. దానితో నన్ను వాసు ... అల్లు అరవింద్ దగ్గర ఒక్క సింగిల్ స్క్రీన్ థియేటర్ కూడా లేదు. ఒక అల్లు అర్జున్ ఏషియన్ థియేటర్ తప్ప ఆయన దగ్గర వేరే థియేటర్లో లేవు అని సమాధానం ఇచ్చాడు. ఇక ఇంత పెద్ద నిర్మాతకే చిన్న సినిమా తీస్తే థియేటర్ల కష్టం ఎదురవుతున్నట్లు దీనితో అర్థం అవుతుంది.