టాలీవుడ్ మెగా ప్రొడ్యుసర్ ఇంట్లో తీవ్ర విషాదం..!
ఇకపోతే శ్యాం ప్రసాద్ రెడ్డి భార్య మరణంతో సినీ సెలబ్రిటీలు , బుల్లితెర ఆర్టిస్టులు ఆమె మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే శ్యాంప్రసాద్ రెడ్డి దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూతురిని వివాహం చేసుకోగా వివాహం అనంతరం ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు జన్మించారు. గత కొన్ని సంవత్సరాల క్రితం శ్యాంప్రసాద్ రెడ్డి తన పెద్ద కూతురికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించిన విషయం తెలిసిందే.
ఇకపోతే శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెరియర్ విషయానికి వస్తే..తలంబ్రాలు, ఆహుతి, అంకుశం లాంటి చిత్రాలు నిర్మించిన ఈయన.. అంజి, అరుంధతి ,అమ్మోరు, లాంటి గ్రాఫికల్ చిత్రాలను తెలుగు తెరకు పరిచయం చేసి భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. అంతే కాదు అంజి సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షో కి నిర్మాతగా వ్యవహరిస్తున్న శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఢీ , క్యాష్ , స్టార్ మహిళ వంటి పలు ఎంటర్టైన్మెంట్ షోలకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు కంటెంట్ బాగుంటే సినిమా నిర్మించడానికి కూడా ముందుకు వస్తున్నారు ముఖ్యంగా కొత్త నటీనటులను ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందుండే శ్యామ్ ప్రసాద్ రెడ్డి అందులో భాగంగానే జబర్దస్త్ ద్వారా ఎంతో మందికి లైఫ్ ఇచ్చారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈయన భార్య మరణంతో కృంగిపోయినట్లు తెలుస్తోంది.