టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని ఆఖరుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. రామ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించాడు. రామ్ "స్కంద" సినిమాలో నటించిన ఒక పాత్రలో కాస్త బరువు ఎక్కువగా కనబడాల్సి ఉండడంతో ఈయన ఆ పాత్ర కోసం చాలా తక్కువ రోజుల్లోనే ఏకంగా 20 కిలాల బరువు పెరిగాడట. ఈ విషయం ఆ సమయంలో సంచలనంగా మారింది. బోయపాటి రూపొందించిన స్కంద మూవీ కోసం రామ్ చాలా తక్కువ రోజుల్లోనే 20 కిలాల బరువు పెరిగి సినిమాపై తన డెడికేషన్ ను రామ్ చూపించుకున్నాడు.
ఇదిలా ఉంటే రామ్ తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన డబల్ ఇస్మార్ట్ సినిమాలో హీరోగా నటించాడు. కావ్య దాపర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ లో హీరో గా నటించిన రామ్ కూడా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు.
అందులో భాగంగా తాజాగా రామ్ పోతినేని కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియచేశాడు. తాజాగా రామ్ పోతినేని మాట్లాడుతూ ... స్కంద మూవీ లో ఒక పాత్ర కోసం బోయపాటి గారు బరువు పెరగాలి అన్నారు. దానితో 20 కిలాల బరువు పెరిగాను. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత పూరి జగన్నాథ్ గారు ఈస్మార్ట్ శంకర్ సినిమాలో మాదిరి గానే నువ్వు డబల్ ఇస్మార్ట్ లో కూడా సన్నగా కనిపించాలి అని చెప్పాడు. దానితో 18 కిలాల బరువు తగ్గాను అని తెలియజేశాడు. ఇలా రామ్ బోయపాటి సినిమా కోసం 20 కిలాల బరువు పెరిగినట్లు , పూరి జగన్నాథ్ సినిమా కోసం 18 కిలాల బరువు తగ్గినట్లు చెప్పుకొచ్చాడు.