రవితేజ కథతో అఖిల్ సినిమా.. అసలు విషయం ఏంటో తెలుసా..?

frame రవితేజ కథతో అఖిల్ సినిమా.. అసలు విషయం ఏంటో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ యువ నటుడు అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన టాలీవుడ్ మాస్ దర్శకుడు అయినటువంటి బోయపాటి శ్రీను దర్శకత్వంలో పొందిన అఖిల్ అనే మూవీ తో హీరో గా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా భారీ అపజయాన్ని అందుకుంది. ఈయన ఇప్పటివరకు అనేక సినిమాలలో హీరోగా నటించాడు. అందులో కేవలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం అందుకుంది. మిగతా సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

ఆఖరిగా ఈ నటుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. 
ఈ మూవీ భారీ అపజయాన్ని అందుకుంది. ఏజెంట్ మూవీ తర్వాత ఈ నటుడు కచ్చితంగా హిట్ కొట్టాలి అనే కసితో ఆచితూచి కథలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ నటుడు ఓ దర్శకుడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొంత కాలం క్రితం కిరణ్ అబ్బవరం హీరోగా వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించాడు.

ఈయన తాజాగా చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో రూరల్ యాక్షన్ డ్రామా కు సంబంధించిన ఓ కథను అఖిల్ కి వినిపించగా ఆ కథ సూపర్ గా నచ్చడంతో అఖిల్ ఈ దర్శకుడి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని యూ వి క్రియేషన్స్ బ్యానర్ వారు పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో రూపొందించడానికి డిసైడ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ దర్శకుడు ఇదే కథను మొదట రవితేజకు వినిపించినట్లు , కాకపోతే ఆయన అప్పటికే అనేక సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండడంతో ఈ మూవీ ని చేయలేను అని చెప్పినట్లు దానితో అదే కథను అఖిల్ కి వినిపించగా ఆయన మాత్రం ఈ మూవీ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: