వయనాడ్ బాధితుల కోసం.. ప్రభాస్ కంటే ఎక్కువ సాయం చేసిన వరుణ్ సందేశ్?
ఈ క్రమంలోనే కొన్ని వందల మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎంతో మంది నిరాశ్రయులుగా మారిపోయారు. ఎన్నో కుటుంబాలు ఇక ప్రియమైన వారిని కోల్పోయి విషాదంలో మునిగిపోయాయి అని చెప్పాలి. దీంతో వాయనాడ్ లో ఎక్కడ చూసినా కూడా రోదనలు మిన్నంటాయి. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో నిరాశ్రయులైన వారిని ఆదుకోవడం కోసం ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు అన్న విషయం తెలిసిందే. స్వచ్ఛందంగానే భారీగా విరాళాలు ప్రకటిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నామ్. అయితే ఇటీవల టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ కూడా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి భారీగా విరాళాన్ని పంపినట్లు ఒక వార్త హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే కోలీవుడ్ హీరో సూర్య ఆయన భార్య జ్యోతిక తమ్ముడు కార్తీలు కలిసి మొత్తం 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపించారు. మరో హీరో దుర్కర్ సల్మాన్ పది లక్షలు అతని తండ్రి మమ్ముట్టి 15 లక్షలు, తమిళ చిత్ర పరిశ్రమ నుంచి కమల్ హాసన్ 25 లక్షలు విరాళం ప్రకటించారు. రష్మిక మందన 10 లక్షలు, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ 25 లక్షలు, రామ్ చరణ్, చిరంజీవి లు కలిపి కోటి రూపాయలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ ఏకంగా రెండు కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించాడు. కాగా ఇప్పుడు హీరో వరుణ్ సందేశ్ ఐదు కోట్ల సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపినట్లు ఒక టాక్ వైరల్ గా మారిపోయింది. అయితే ప్రభాస్ లాంటి స్టార్ హీరోనే రెండు కోట్లు ఇస్తే వరుణ్ ఎలా అయిదు కోట్లు ఇచ్చాడు. అతనికి పెద్దగా సినిమాలు కూడా లేవు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.