నేషనల్ క్రష్ గా గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. మొన్నటిదాకా కేవలం సౌత్ సినిమాల్లో మాత్రమే నటించిన ఈ ముద్దుగుమ్మ యానిమల్ సినిమాతో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో తనకి బాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇక రష్మిక మందన తో సినిమా చేయడం అంటే అదో పెద్ద సాహసం అనే చెప్పాలి.
సాధారణంగా రష్మిక మందన డేట్స్ అస్సలు ఖాళీ ఉండవు. తన డేట్స్ అడ్జస్ట్ కాక ఇప్పటికే చాలా సినిమాలకి నో చెప్పింది రష్మిక మందన. అయితే అలా రష్మిక మందన నో చెప్పిన సినిమాల్లో 100 కోట్లు కలెక్టర్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే.. మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నక్కిన త్రినాథ రావు డైరెక్షన్ లో వచ్చిన సినిమా ధమాకా. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. కానీ సినిమాకు ముందు అనుకున్న హీరోయిన్
రష్మికనే. ఆమె కూడా మొదట్లో దాదాపు ఓకే అన్నట్టు అనుకుని తర్వాత డేట్స్ అడ్జెస్ట్ అవ్వక అమ్మడు ఆ ఛాన్స్ మిస్ చేసుకుంది. రష్మిక మిస్ చేసుకున్న ఈ అవకాశాన్ని పెళ్లిసందడితో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల పట్టేసుకుంది. ధమాకా తర్వాత శ్రీలీలకు దాదాపు ఏడెమిది సినిమాలు వచ్చాయంటే ఆ సినిమా ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రవితేజ లక్కీ సెంటిమెంట్ శ్రీలీలకు కలిసి వచ్చింది. అయితే ఆ సినిమాలో రష్మిక చేసి ఉంటే ఫలితం ఎలా ఉండేదో మరి. ఐతే అప్పుడు కుదరని ఈ కాంబో మళ్లీ సెట్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రష్మిక కుబేర, పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు చేస్తుంది. ఇదే కాకుండా మరో రెండు బాలీవుడ్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. సో ఆమె అనుకున్నా కూడా ఇప్పుడు కాంబినేషన్స్ సెట్ చేయలేనంత బిజీగా మారింది అమ్మడు...!!